దీపక్‌ కొచ్చర్‌కు రెండోసారి నోటీసులు

30 Apr, 2018 15:29 IST|Sakshi

వీడియోకాన్‌ రుణ వ్యవహారంలో ఐసీఐసీఐ బ్యాంకు చీఫ్‌ చందా కొచ్చర్‌ భర్త దీపక్‌ కొచ్చర్‌కు మెడ చుట్టు ఉచ్చు బిగుస్తూనే ఉంది. రెండో సారి దీపక్‌ కొచ్చర్‌కు ఆదాయపు పన్ను శాఖ నోటీసులు పంపింది. ఆదాయపు పన్ను చట్టం సెక్షన్‌ 139(9) కింద వ్యక్తిగత ఆదాయంపై వివరణ ఇవ్వాలంటూ దీపక్‌ కొచ్చర్‌కు ఈ నోటీసులు జారీ చేసింది. అదేవిధంగా వీడియోకాన్‌ గ్రూప్‌ వేణుగోపాల్‌ ధూత్‌, దీపక్‌ కొచ్చర్‌ జాయింట్‌ వెంచర్‌ అయిన న్యూపవర్‌ రెన్యూవబుల్స్‌లో మేజర్‌ షేర్‌హోల్డర్‌ డీహెచ్‌ రెన్యూవబుల్స్‌ హోల్డింగ్‌ లిమిటెడ్‌ ఓనర్‌షిప్‌ వివరాలు కూడా తెలుపాలంటూ మారిషస్‌ పన్ను అధికారులను ఐటీ డిపార్ట్‌మెంట్‌ కోరింది.

2012లో క్విడ్‌ ప్రొ కో ప్రాతిపదికన వీడియోకాన్‌ గ్రూప్‌కు ఐసీఐసీఐ బ్యాంకు రూ.3250 కోట్ల రుణాలు మంజూరు చేయడంలో చందాకొచ్చర్‌, ఆమె కుటుంబ సభ్యుల ప్రమేయముందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. అనంతరం ఈ రుణ వ్యవహారంలో చందా కొచ్చర్‌ లబ్ది పొందారని, ఆమె భర్త పరోక్ష లబ్దిదారుడని ఇండియన్‌ ఇన్వెస్టర్స్‌ కౌన్సిల్‌ ట్రస్టీ అరవింద్‌ గుప్తా సాక్ష్యాలతో సహా ఆరోపిస్తున్నారు. 

మరిన్ని వార్తలు