పసిడి ధర పైపైకి..

4 May, 2020 18:39 IST|Sakshi

ముంబై : కరోనా మహమ్మారితో ఈక్విటీ మార్కెట్లు పతనమవడంతో బంగారం ధరలకు రెక్కలొచ్చాయి. రెండు రోజులుగా పదిగ్రాముల బంగారం రూ 1000 భారమైంది. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్‌-19 కేసులు వేగంగా ప్రబలుతుండటంతో సురక్షిత పెట్టుబడి సాధనంగా పసిడి వైపు ఇన్వెస్టర్లు మొగ్గుచూపుతున్నారు. దీంతో దేశీ మార్కెట్‌లోనూ యల్లోమెటల్‌ తళుకులీనింది. సోమవారం ముంబై ఎంసీఎక్స్‌లో పదిగ్రాముల పసిడి రూ 85 పెరిగి రూ 45,612కు చేరింది.

మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్‌ బంగారం 1700 డాలర్ల వద్ద నిలకడగా సాగుతోంది. అమెరికా-చైనా మధ్య ట్రేడ్‌వార్‌ తప్పదనే ఆందోళనతో గోల్డ్‌లో పెట్టుబడి డిమాండ్‌ పెరగవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తికి చైనాను నిందిస్తూ పలు దేశాలు బీజింగ్‌పై చర్యలకు సిద్ధమయ్యే అవకాశాలుండటంతో పసిడికి డిమాండ్‌ పెరిగే అవకాశం ఉందని బులియన్‌ నిపుణులు భావిస్తున్నారు.

చదవండి : కొండెక్కిన బంగారం..కొనుగోళ్లు డీలా!

మరిన్ని వార్తలు