ఏడేళ్లలో వేయి విమానాలు..

15 Jan, 2019 15:16 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : భారత్‌ రానున్న ఏడెనిమిదేళ్లలో వేయి విమానాలను ప్రయాణీకులకు అందుబాటులోకి తీసుకురానుంది. రానున్న పదిహేను సంవత్సరాల్లో దేశంలో అదనంగా మరో 100 విమానాశ్రయాలు సమకూరుతాయని, ఏడెనిమిదేళ్లలో వేయికి పైగా విమానాలు తోడవనున్నాయని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కార్యర్శి ఆర్‌ఎన్‌ చూబే పేర్కొన్నారు.

భారత్‌ ఏవియేషన్‌ లోకోమోటివ్‌ హబ్‌గా మారనుందని ఆర్‌ఎన్‌ చూబే చెప్పారు. గత నాలుగేళ్లుగా దేశీయ పౌరవిమాన యాన పరిశ్రమ 20 శాతం వార్షిక వృద్ధితో ఎదుగుతోందని వెల్లడించారు. భారత్‌లో విమానయాన వృద్ధి రేటు ప్రపంచంలోనే అత్యధికమని, ఇది నిలకడగా కొనసాగుతున్నదని ఫిక్కీ ఆధ్వర్యంలో జరిగిన గ్లోబల్‌ ఏవియేషన్‌ సమ్మిట్‌లో తెలిపారు. ఏవియేషన్‌ ఇంధన ధరలు భారం కాకుండా ఉంటే మరో ఇరవయ్యేళ్లు ఈ వృద్ధి కొనసాగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. విమానయాన వృద్ధికి అవసరమైన తోడ్పాటును ప్రభుత్వం అందిస్తుందని చూబే చెప్పారు.

మరిన్ని వార్తలు