ఐదో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌: నివేదిక

19 Feb, 2020 20:31 IST|Sakshi

ముంబై: దేశ ఆర్థిక వ్యవస్థకు ఊపు తెచ్చే నివేదిక విడుదలయింది. భారత్‌ ఐదో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతోందని అమెరికాకు చెందిన వరల్డ్‌ పాపులేషన్‌ రివ్యూ అనే సంస్థ తెలిపింది. బలమైన బ్రిటన్‌, ఫ్రాన్స్‌ దేశాలను అధిగమించి భారత్‌ ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచిందని సంస్థ పేర్కొంది. డిసెంబరు నాటికి భారత జీడీపీ 2.94 లక్షల కోట్ల డాలర్లకు చేరింది. ప్రస్తుత డాలర్‌ను రూపాయితో పోల్చి చూసినప్పుడు ఇది రూ.209.62 లక్షల కోట్లకు సమానం.

తలసరి కొనుగోలు శక్తి (పీపీపీ) పరంగా చూస్తే దేశీయ ఆర్థిక వ్యవస్థ 10.51 లక్షల కోట్ల డాలర్లతో అమెరికా, చైనా తర్వాతి స్థానంలో ఉండడం విశేషం. 1990లో భారత్‌ అమలు చేసిన పారిశ్రామిక సంస్కరణలు ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడానికి ఉపపయోగపడిందని తెలిపింది. ప్రపంచంలోనే దేశీయ సేవా రంగం వేగంగా అభివృద్ధి చెందుతుందని, తయారీ రంగం, వ్యవసాయ రంగం దేశయ ఆర్ధిక వ్యవస్థ బలోపేతానికి ముఖ్య రంగాలని నివేదిక స్పష్టం చేసింది. వరల్డ్‌ పాపులేషన్‌ రివ్యూ అనే సంస్థ పారదర్శకంగా నివేదికను రూపోందిస్తుందని ఆర్ధిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని వార్తలు