వృద్ధి వేగంలో చైనాకన్నా భారత్‌ ముందు

23 Jan, 2018 01:51 IST|Sakshi

2018పై ఐఎంఎఫ్‌ అంచనా  

వాషింగ్టన్‌ /దావోస్‌: భారత్‌ 2018లో 7.4 శాతం వృద్ధి రేటును సాధిస్తుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) అంచనా వేసింది. చైనా వృద్ధి రేటు 6.8 శాతంగానే ఉంటుందని, తద్వారా ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా 2018లో భారతదేశమే ముందుంటుందని తన తాజా నివేదికలో విశ్లేషించింది.

పెద్దనోట్ల రద్దు, వస్తు– సేవల పన్ను (జీఎస్‌టీ) అమలుకు సంబంధించి ఆర్థిక మందగమనం నుంచి భారత్‌ కోలుకుంటోందని తన వరల్డ్‌ అవుట్‌లుక్‌లో వివరించింది. 2019లో భారత్‌ వృద్ధి రేటు 7.8 శాతంగా ఉంటుందనీ ఐఎంఎఫ్‌ అంచనావేసింది. వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరమ్‌ సందర్భంగా దావోస్‌ (స్విట్జర్లాండ్‌)లో ఐఎంఎఫ్‌ ఈ అవుట్‌లుక్‌ను ఆవిష్కరించింది. 2018–19లో ఆసియా వృద్ధి 6.5 శాతంగా ఐఎంఎఫ్‌ అవుట్‌లుక్‌.   

మరిన్ని వార్తలు