భారత్‌కు మంచి రేటింగ్‌ ఇవ్వవచ్చు: ఓఈసీడీ

1 Mar, 2017 01:18 IST|Sakshi

న్యూఢిల్లీ: రేటింగ్‌ను పెంచడానికి అనువైన పరిస్థితులు భారత్‌ ఆర్థిక వ్యవస్థకు ఉన్నట్లు ఆర్థిక విశ్లేషణా సంస్థ– ఓఈసీడీ పేర్కొంది. ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో భారత్‌పై ఓఈసీడీ ఆర్థిక సర్వే నివేదిక ఒకటి విడుదలైంది. భారత్‌ ఆర్థిక సలహాదారు శక్తికాంత్‌ దాస్,  ఓఈసీడీ సెక్రటరీ జనరల్‌ యాజిల్‌ గురియా తదితర సీనియర్‌ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఆర్థిక సంక్షోభ పరిస్థితుల వరకూ భారీ తనఖాలతో మునిగిఉన్న బ్యాంకులకు ‘ఏఏఏ’ గ్రేడింగ్‌లు ఇచ్చేసిన రేటింగ్‌ సంస్థలు... అత్యంత జాగరూకతతో ఇప్పుడు వ్యవహరిస్తున్నాయని అన్నారు. భారత్‌ వృద్ధి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 7 శాతం, వచ్చే ఆర్థిక సంవత్సరం 7.3 శాతం నమోదవుతుందని, 2018–19లో ఈ రేటు 7.7 శాతానికి పెరుగుతుందని ఓఈసీడీ అంచనావేస్తోంది. 

>
మరిన్ని వార్తలు