వరల్డ్ ఎకనమిక్ ఫ్రీడమ్ ఇండెక్స్లో దిగువకు భారత్

17 Sep, 2016 01:16 IST|Sakshi
వరల్డ్ ఎకనమిక్ ఫ్రీడమ్ ఇండెక్స్లో దిగువకు భారత్

న్యూఢిల్లీ: వరల్డ్ ఎకనమిక్ ఫ్రీడమ్ ఇండెక్స్‌లో భారత్ ర్యాంక్ తగ్గింది. ఎకనమిక్ ఫ్రీడమ్ ఆఫ్ ద వరల్డ్-2016 వార్షిక నివేదిక ప్రకారం.. ఇండియా పది స్థానాలు కోల్పోయి 112వ స్థానంలో నిలిచింది. న్యాయ వ్యవస్థ, ఆస్తి హక్కు, అంతర్జాతీయ వ్యాపారం, నియంత్రణలు, ప్రభుత్వపు పరిమాణం వంటి పలు అంశాల్లో భారత్ పేలవ ప్రదర్శన కనబరిచిందని నివేదిక పేర్కొంటోంది. దీంతో ర్యాంక్ కిందకు పడింది. కాగా చైనా, బంగ్లాదేశ్, పాకిస్తాన్ దేశాలు భారత్ వెనక వరుసలో నిలిచాయి.

ఇవి వరుసగా 113వ స్థానాన్ని, 121వ స్థానాన్ని, 133వ స్థానాన్ని కైవసం చేసుకున్నాయి. ఇక భూటాన్ (78వ స్థానం), నేపాల్ (108వ స్థానం), శ్రీలంక (111వ స్థానం) దేశాలు మన కన్నా ముందు వరుసలో నిలిచాయి. టాప్‌లో హాంకాంగ్, సింగపూర్, న్యూజిలాండ్, స్విట్జర్లాండ్, కెనడా, జార్జియా, ఐర్లాండ్, మారిషస్, యూఏఈ, ఆస్ట్రేలియా, యూకే వంటి దేశాలు ఉన్నాయి. చివర్లో ఇరాన్, అల్జీరియా, అర్జెం టినా, గినియా వంటి దేశాలు నిలిచాయి.

మరిన్ని వార్తలు