లక్ష్యాన్ని మించి డిజిన్వెస్ట్‌మెంట్‌ నిధుల సమీకరణ

1 Apr, 2017 00:32 IST|Sakshi
లక్ష్యాన్ని మించి డిజిన్వెస్ట్‌మెంట్‌ నిధుల సమీకరణ

2016–17లో రూ.46,247 కోట్లు
న్యూఢిల్లీ: ప్రభుత్వ సంస్థల్లో వాటాల విక్రయం (డిజిన్వెస్ట్‌మెంట్‌) ద్వారా కేంద్ర ప్రభుత్వం గత ఆర్థిక సంవత్సరం(2016–17)లో రూ.46,247 కోట్లు సమీకరించింది. ఈ మొత్తంలో వ్యూహాత్మక డిజిన్వెస్ట్‌మెంట్, ఎస్‌యూయూటీఐ ఇన్వెస్ట్‌మెంట్‌ ద్వారా రూ.10,779 కోట్లు, సీపీఎస్‌ఈ డిజిన్వెస్ట్‌మెంట్‌ ద్వారా రూ.35,468 కోట్లు చొప్పున కేంద్రం సమీకరించింది. గత ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో డిజిన్వెస్ట్‌మెంట్‌ ద్వారా రూ. 56,500 కోట్లు సమీకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఆ తర్వాత దానిని రూ.45,000 కోట్లకు సవరించింది. చివరకు సవరించిన లక్ష్యాన్ని మించి రూ.46,247 కోట్లు సమీకరించగలిగింది.

>
మరిన్ని వార్తలు