వృద్ధి లక్ష్య సాధన కష్టమే: మూడీస్‌

5 Feb, 2020 10:58 IST|Sakshi

న్యూఢిల్లీ: భారత్‌ వృద్ధి లక్ష్య సాధన కొంత కష్టమేనని అంతర్జాతీయ రేటింగ్‌ దిగ్గజం- మూడీస్‌ ఇన్వెస్టర్స్‌ సర్వీస్‌ తన తాజా నివేదికలో పేర్కొంది. 2019-20లో 4.9 శాతం వాస్తవ వృద్ధి రేటు నమోదయ్యే వీలుందని, 2020-21లో ఈ రేటు 5.5 శాతానికి పెరగవచ్చని అంచనావేసింది. భారత్‌ ఆర్థిక వ్యవస్థ వృద్ధి సాధనకు ప్రధానంగా సంస్థాగత సవాళ్లను ఎదుర్కొనాల్సి ఉంటుందని పేర్కొంది. తాజా సీతారామన్‌ ఆర్థిక బడ్జెట్‌ ప్రకారం- 2020-21లో భారత్‌ నామినల్‌ (ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకోకుండా) స్థూల దేశీయోత్పత్తి 10 శాతం. 2021-22, 2020-23ల్లో ఇది 12.6 శాతం, 12.8 శాతానికి పెరుగుతుందని బడ్జెట్‌ అంచనావేసింది. అయితే 2019-20లో ఈ రేటు 7.5 శాతంగా ఉంటుందని, 2020-21లో 8.7 శాతంగా నమోదవుతుందని మూడీస్‌ అంచనావేసింది. 

>
మరిన్ని వార్తలు