ప్రపంచంలోకెల్ల అతిపెద్ద భారతీయ వీసా సెంటర్‌ అక్కడే..

14 Jul, 2018 18:37 IST|Sakshi
ఢాకాలో అతిపెద్ద వీసా సెంటర్‌ను ప్రారంభిస్తున్న కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌

ఢాకా : ప్రపంచంలోనే అతిపెద్ద భారతీయ వీసా​ సెంటర్‌ను బంగ్లాదేశ్‌ ఢాకాలో శనివారం కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌ నాథ్‌ సింగ్‌ ప్రారంభించారు. ప్రస్తుతం మూడు రోజుల పర్యటన నిమిత్తం బంగ్లాదేశ్‌ వెళ్లిన రాజ్‌నాథ్‌ సింగ్‌ ఢాకాలోని జమున ఫ్యూచర్‌ పార్క్‌లో దాదాపు 18, 500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ వీసా సెంటర్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాజ్‌నాథ్‌ సింగ్‌తో పాటు బంగ్లాదేశ్‌ హోం మినిస్టర్‌ అసదుజామాన్‌ ఖాన్‌ కమల్‌ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజ్‌నాథ్‌ సింగ్‌ ‘అన్ని ఆధునిక హంగులతో ఏర్పాటు చేసిన ఈ వీసా సెంటర్‌ వల్ల, వీసా కోసం ఎదురుచూసే సమయం గణనీయంగా తగ్గునుంద’ని తెలిపారు.

ఈ విషయం గురించి ఇండియన్‌ హై కమిషనర్‌ హర్ష వర్ధన్‌ శ్రింగ్లా ‘జమునా పార్క్‌లో ఏర్పాటు చేసిన ఈ వీసా సెంటర్‌ ప్రంపంచలోకెల్లా అతిపెద్ద భారతీయ వీసా సెంటర్‌. ఇప్పటికే బంగ్లాదేశ్‌లో 12 భారతీయ వీసా సెంటర్‌లు ఉన్నాయి. వాటిల్లో మోతీఝీల్‌, ఉత్తర, ఢాకా, గుల్షన్‌లో ఉన్ననాలుగు వీసా సెంటర్‌లను ఆగస్టు 31 నాటికి ఇక్కడికే మారుస్తాం అని తెలిపారు. బంగ్లాదేశ్‌ నుంచి చాలా ఎక్కువ సంఖ్యలో పర్యాటకులు భారత్‌కు వస్తూంటారు. గతేడాది భారత ప్రభుత్వం 14 లక్షల మంది బంగ్లాదేశీయులకు వీసాలు జారీ చేసింది.

మరిన్ని వార్తలు