పటిష్టంగా దేశ ఎకానమీ

11 Jul, 2020 05:27 IST|Sakshi
అనురాగ్‌ సింగ్‌ ఠాకూర్‌

పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రండి

పరిశ్రమ వర్గాలకు కేంద్ర మంత్రి అనురాగ్‌ సింగ్‌ ఠాకూర్‌ సూచన

న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థ వ్యవస్థాగతంగా పటిష్టంగా ఉన్న నేపథ్యంలో పరిశ్రమల వర్గాలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్‌ సింగ్‌ ఠాకూర్‌ పిలుపునిచ్చారు. పెట్టుబడులకు ఊతమిచ్చే దిశగా కార్పొరేట్‌ ట్యాక్స్‌ రేట్లు తగ్గించడంతో గత ఆరేళ్లుగా కేంద్రం అనేక సంస్కరణలను ప్రవేశపెట్టిందని పరిశ్రమల సమాఖ్య సీఐఐ నిర్వహించిన వెబినార్‌లో పేర్కొన్నారు.

దిగుమతులపై ఆధారపడటం తగ్గాలి: మంత్రి మాండవీయ
నౌకాశ్రయాల్లో కార్గో హ్యాండ్లింగ్‌కు ఉపయోగపడే క్రేన్లు మొదలైన కీలక ఉత్పత్తుల తయారీలో స్వయం సమృద్ధి సాధించడంపై దేశీ కంపెనీలు మరింతగా దృష్టి పెట్టాలని కేంద్ర షిప్పింగ్‌ శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ సూచించారు. అలాగే, ఔషధాల తయారీలో ప్రధానమైన ముడి పదార్థాల ఉత్పత్తి కూడా దేశీయంగా పెంచాలని, తద్వారా దిగుమతులపై ఆధారపడటం తగ్గించుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. ఉత్తరాది ప్రాంత సీఈవోలతో పరిశ్రమల సమాఖ్య సీఐఐ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా వర్చువల్‌ ప్లాట్‌ఫాం ద్వారా మంత్రి ఈ విషయాలు తెలిపారు. 

మరిన్ని వార్తలు