జోరుగా ముందస్తు పన్ను వసూళ్లు

16 Dec, 2015 02:24 IST|Sakshi
జోరుగా ముందస్తు పన్ను వసూళ్లు

అగ్రస్థానంలో ప్రైవేట్ బ్యాంక్‌లు
ముంబై: ముందస్తు పన్ను వసూళ్లు డిసెంబర్ క్వార్టర్లో జోరుగా ఉన్నాయి. ఈ ప్రాంతంలోని 45 కంపెనీల నుంచి అక్టోబర్-డిసెంబర్ క్వార్టర్‌కు ముందస్తు పన్ను వసూళ్లు 12 శాతం వృద్ధితో  రూ.24,279 కోట్లకు చేరాయని ఆదాయపు పన్ను అధికారులు వెల్లడించారు. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌కు ముందస్తు పన్ను వసూళ్లు రూ.21,681 కోట్లుగా ఉన్నాయని వారు పేర్కొన్నారు.  

పన్ను వసూళ్ల లక్ష్యాన్ని చేరతామని ప్రధాన ఆదాయపు పన్ను చీఫ్ కమిషనర్ డి. ఎస్. సక్సేనా చెప్పారు. ప్రైవేట్ బ్యాంక్‌ల నుంచి ముందస్తు పన్ను వసూళ్లు జోరుగా ఉన్నాయని పేర్కొన్నారు. హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంక్‌లు అగ్రస్థానంలో ఉన్నాయని, మొండి బకాయిలు భారీగా పెరిగిపోవడంతో ప్రభుత్వ రంగ బ్యాంక్‌ల నుంచి ముందస్తు పన్ను వసూళ్లు ప్రోత్సాహ కరంగా లేవని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు