పానాసానిక్ ప్రాంతీయ కేంద్రంగా భారత్

19 Mar, 2014 02:07 IST|Sakshi
పానాసానిక్ ప్రాంతీయ కేంద్రంగా భారత్

 న్యూఢిల్లీ: పానాసానిక్ కంపెనీ భారత్‌లోని తన కార్యాలయాన్ని ప్రాంతీయ హబ్‌గా రూపొందిస్తోంది. వచ్చే నెల నుంచి సార్క్, ఆఫ్రికా, మధ్య ఆసియా దేశాలకు రీజనల్ హబ్‌గా తమ భారత్ కేంద్రం కార్యకలాపాలు నిర్వహిస్తుందని పానాసానిక్ ఇండియా ఎండీ మనీష్ శర్మ పేర్కొన్నారు. ఈ దేశాలన్నీ భారత్‌కు దగ్గరగా ఉండడం, ఇదొక తయారీ కేంద్రంగా వ్యూహాత్మక స్థానంలో ఉండడం తదితర కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు.  ఇలాంటి రీజనల్ హబ్‌లు పానాసానిక్ కంపెనీకి ప్రపంచవ్యాప్తంగా జపాన్, ఉత్తర అమెరికా, ఆసియా, యూరప్, లాటిన్ అమెరికాల్లో ఉన్నాయని పేర్కొన్నారు.

 కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 165 కోట్ల డాలర్ల అమ్మకాలు సాధించాలన్న లక్ష్యానికి చేరువగానే ఉన్నామని శర్మ పేర్కొన్నారు. ఆసియా, ఆఫ్రికా దేశాల్లో అవసరమైన వారికి లక్ష సౌర శక్తి లాంతర్లందించే కార్యక్రమాన్ని చేపట్టామని, దీంట్లో భాగంగా, 2018 కల్లా 35,000 లాంతర్లను భారత్‌లో అందించనున్నామని చెప్పారు. ఈ లాంతర్ల పంపిణి కోసం ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, బీహార్ రాష్ట్రాల్లోని ఆరు ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నామని శర్మ వివరించారు.

మరిన్ని వార్తలు