బంగారం దిగుమతుల భారీ పతనం

5 Feb, 2018 18:24 IST|Sakshi

సాక్షి, ముంబై: భారతీయ బంగారం దిగుమతులు  భారీగా పడిపోయాయి. తక్కువ డిమాండ్‌ కారణంగా జనవరి  మాసానికి సంబంధించిన బంగారం దిగుమతులు భారీ క్షీణతను నమోదు చేశాయి.   భారీగా పెరిగిన ధర, దిగుమతి సుంకంపై కోత ఉంటుందన్న అంచనాల  నేపథ్యంలో బంగారం దిగుమతులు పడిపోయాయని తాజా లెక్కలు తేల్చాయి.  జనవరిలో బంగారం దిగుమతులు 17 నెలల కనిష్టాన్ని నమోదు చేశాయని  విలువైన లోహాల కన్సల్టెన్సీ జీఎఫ్‌ఎంఎస్‌  నివేదించింది. జనవరి  మాస పసిడి దిగుమతులు 37 శాతం క్షీణించి 30 టన్నులుగా నమోదైంది.  గత ఏడాది  ఇది47.9గా ఉందని జీఎఫ్‌ఎంఎస్‌ సీనియర్‌ ఎనలిస్ట్‌  సుధీష్‌ నంబియాత్‌  సోమవారం  వెల్లడించారు. ఈ బడ్జెట్‌లో  పన్ను కోత ఉంటుందని పరిశ్రమ ఎదురు  చూసిందన్నారు.

ధరల పెంపుతో కొనుగోలుదారులు కొనుగోళ్లు వాయిదా వేసినట్టు జీఎఫ్‌ఎంఎస్‌  పేర్కొంది. చైనా తర్వాత ప్రపంచంలో రెండవ అతి పెద్ద బంగారం వినియోగదారుగా ఉన్న భారత్‌లో కొనుగోళ్లు పడిపోవడం, ఎనిమిది వారాల్లో 7 శాతం పైగా పెరిగిన ప్రపంచ ధరలపై భారీగాఉంటుందని  తెలిపింది. తగ్గిన దిగుమతులు కారణంగా డిసెంబర్‌ మూడేళ్ల గరిష్టాన్ని చేరుకున్న ద్రవ్యలోటును తగ్గించుకోవడానికి ఉపయోగపడుతుందని జీఎఫ్‌ఎంఎస్‌  వ్యాఖ్యానించింది. 

కాగా డిసెంబర్‌ నెలలో బంగారం  ధర  ఐదు నెలల కనిష్ఠ స్థాయికి పడిపోగా..జనవరిలో 17 నెలల గరిష్టానికి ఎగబాకాయి. దేశంలో విదేశీ బంగారం కొనుగోళ్లు డిసెంబర్లో 80.4 టన్నులుగా ఉండగా,  గత ఏడాదితో పోలిస్తే 61 శాతం పెరిగినట్టు జీఎఫ్ఎస్ఎం గణాంకాలు ద్వారా తెలుస్తోంది. తక్కువ ధరల నేపథ్యంలో డిసెంబరులో భారతీయ బ్యాంకులు  బంగారాన్ని పెద్ద ఎత్తున  దిగుమతి చేసుకున్నాయనీ, దీంతో జనవరిలో దిగుమతులు తగ్గాయని   బులియన్ డీలర్ తెలిపారు. అలాగే ఫిబ్రవరిలో దిగుమతులు  పుంజుకుని, 50 టన్నులకు చేరవచ్చని మరో డీలర్‌ అభిప్రాయపడ్డారు.

మరిన్ని వార్తలు