కరెన్సీ మోసం జరిగింది కెయిర్న్ డీల్లోనే!!

22 Jul, 2016 13:02 IST|Sakshi
కరెన్సీ మోసం జరిగింది కెయిర్న్ డీల్లోనే!!

ఇద్దరు హెచ్‌ఎస్‌బీసీ  అధికార్లపై కేసులు
లావాదేవీకి ముందే పౌండ్ల కొనుగోలు

 లండన్: బ్రిటిష్ బ్యాంకింగ్ దిగ్గజం ‘హెచ్‌ఎస్‌బీసీ’కి సంబంధించిన 3.5 బిలియన్ డాలర్ల ఫారెక్స్ ట్రేడింగ్ మోసంలో భారతీయ కంపెనీ లింకులు బయటపడ్డాయి. ఫారెక్స్ మోసానికి సంబంధించి బ్యాంక్‌కు చెందిన ఇద్దరు ఎగ్జిక్యూటివ్‌లపై అభియోగాలు నమోదయ్యాయి.  ఒక కంపెనీ (క్లయింట్) తన భారతీయ వ్యాపారాన్ని వేరొక కంపెనీకి విక్రయించిన ఘటనలో వీరిద్దరూ ఆ క్లయింట్‌ను మోసం చేశారనేది ప్రధాన అభియోగం. ఆ క్లయింట్ ఎవరన్నది అధికారికంగా బయటపడకపోయినా యూకే మీడియా నివేదికల ప్రకారం అది కెయిర్న్ ఎనర్జీగా వెల్లడవుతోంది.

ఇది 2010లో కెయిర్న్ ఇండియాలోని తన వాటాను 3.5 బిలియన్ డాలర్లకు వేదాంతాకు విక్రయించింది. దీంతో ఈ కొనుగోలు లావాదేవీకి సంబంధించి కెయిర్న్ ఎనర్జీ... హెచ్‌ఎస్‌బీసీని ఫారెక్స్ కన్వర్టర్‌గా (3.5 బిలియన్ డాలర్లని పౌండ్లలోకి మార్చడానికి) నియమించుకుంది. దీన్ని గురించి తెలిసిన హెచ్‌ఎస్‌బీసీ ఫారెక్స్ ట్రేడింగ్ విభాగం హెడ్ మార్క్ జాన్సన్, హెచ్‌ఎస్‌బీసీ మాజీ ఉద్యోగి స్ట్రాట్ స్కాట్ దీనిద్వారా లబ్ధి పొందాలనుకున్నారు. లావాదేవీ జరగటానికి ముందే భారీగా పౌండ్లను కొనుగోలు చేశారు.

మరిన్ని వార్తలు