భారత్‌లో పెరగనున్న బిలియనీర్లు..

5 Mar, 2020 16:39 IST|Sakshi

న్యూఢిల్లీ : ప్రపంచవ్యాప్తంగా అత్యధిక సంపద కలిగిన వ్యక్తుల (హెచ్‌ఎన్‌ఐ) సంఖ్య 2018తో పోలిస్తే 2019లో 6.4 శాతం పెరిగి 5,13,200 మందికి పెరిగిందని నైట్‌ఫ్రాంక్‌ సంపద నివేదిక వెల్లడించింది. ఈ తరహా సంపన్నుల జాబితాలో 5,986 మంది అత్యంత సంపన్నులతో భారత్‌ 12వ స్ధానంలో నిలిచిందని తెలిపింది. 2024 నాటికి భారత్‌లో అత్యంత సంపన్నుల సంఖ్య 10,354కు పెరుగుతుందని అంచనా వేసింది. ఇక 2019లో భారత్‌లో 104గా ఉన్న బిలియనీర్ల సంఖ్య 2024 నాటికి 113కు చేరుతుందని పేర్కొంది.

ఇక భారత్‌లో అత్యంత సంపన్నులు అధికంగా తమ రాబడిలో 72 శాతం ఈక్విటీ మార్కెట్లలో మదుపుచేసేందుకు మొగ్గుచూపుతున్నారు. ఈక్విటీ మార్కెట్లలో అత్యంత సంపన్నులు మదుపు చేసే సగటు పెట్టుబడి 29 శాతం కంటే ఇది అధికం కావడం గమనార్హం. ప్రపంచవ్యాప్తంగా 200 దేశాలకు చెందిన అత్యంత సంపన్నులకు సంబంధించి 3.3 లక్షల డాలర్ల వెల్త్‌ను పర్యవేక్షిస్తున్న ప్రైవేట్‌ బ్యాంకర్లు, వెల్త్‌ అడ్వైజర్ల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని ఈ సర్వే రూపొందింది. ప్రస్తుతం అత్యంత సంపన్నులు, బిలియనీర్ల జాబితాలో అమెరికా ముందుండగా 2024 నాటికి అమెరికా, యూరప్‌లకు దీటుగా ఆసియా సత్తా చాటనుందని నైట్‌ఫ్రాంక్‌ అంచనా వేసింది.

చదవండి : ప్రపంచ కుబేరుల్లో ‘చిన్నది’

మరిన్ని వార్తలు