జీడీపీ వృద్ధి రేటు కోత! 

1 May, 2019 00:28 IST|Sakshi

2019–20లో 7.3 శాతమే!

ఇండియా రేటింగ్స్‌ తాజా నివేదిక

అంతక్రితం అంచనా 7.5 శాతం

సాధారణ వర్షపాతంపై అనుమానాలు

పారిశ్రామిక ఉత్పత్తిపై సందేహాలు  

న్యూఢిల్లీ: భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటును ఇండియా రేటింగ్స్‌ అండ్‌ రీసెర్చ్‌ మంగళవారం తగ్గించింది. ఇంతక్రితం అంచనా 7.5 శాతంకాగా, దీనిని 20 బేసిస్‌ పాయింట్లు తగ్గించి 7.3 శాతానికి కుదించింది. సాధారణంకన్నా తక్కువ వర్షపాతం నమోదు, పారిశ్రామిక ఉత్పత్తి భారీ వృద్ధిపై అనుమానాలు వంటి అంశాలు తమ వృద్ధిరేటు కోత అంచనాలకు కారణమని అంతర్జాతీయ రేటింగ్‌ దిగ్గజం ఫిచ్‌ గ్రూప్‌ విభాగం అయిన ఇండియా రేటింగ్స్‌ అండ్‌ రీసెర్చ్‌ పేర్కొంది. తాజా నివేదికలో ముఖ్యాంశాలు చూస్తే... 

►పారిశ్రామిక ఉత్పత్తిలో తయారీ, విద్యుత్‌ రంగాల పనితీరు పేలవంగా ఉంది.  
​​​​​​​►దివాలా చట్టం 2016 కింద నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌కు నివేదిస్తున్న కేసుల విచారణ మందగమనంలో ఉంది. ఒకచోటు నిరర్థకంగా ఉండిపోయిన మూలధనాన్ని తిరిగి ఉత్పత్తి ప్రక్రియలోకి తీసుకురావడం కష్టంగా మారుతున్న తరుణంలో ఈ అంశం కూడా వృద్ధితీరుపై ప్రభావం చూపే వీలుంది.  
​​​​​​​►పెట్టుబడుల వ్యయ వృద్ధి రేటు అంచనాలను 10.3% నుంచి 9.2%కి తగ్గించింది.  
​​​​​​​►వ్యవసాయ రంగం వృద్ధి అంచనాను 3 శాతం నుంచి 2.5 శాతానికి కుదించింది.  2018–19లో ఈ రేటు 2.7 శాతం. 
​​​​​​​►సేవల రంగం కొంత మెరుగైన ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉంది. 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

సెన్సెక్స్‌ 2,476 పాయింట్లు అప్‌

లాభాల జోరు,  30వేల ఎగువకు సెన్సెక్స్

55 పైసలు ఎగిసిన రూపాయి

నియామకాలపై కోవిడ్‌-19 ఎఫెక్ట్‌

కరోనా ఎఫెక్ట్ : రూ. 5 లక్షల కోట్లకు

సినిమా

పెద్దాయన సన్‌ గ్లాసెస్‌ వెతకండ్రా

రూ.1.25 కోట్ల విరాళం ప్ర‌క‌టించిన అజిత్‌

టిక్‌టాక్ వీడియోపై ర‌ష్మి ఆగ్ర‌హం

క‌రోనా : న‌టి టిక్‌టాక్ వీడియో వైర‌ల్‌

నటుడి కుటుంబానికి కరోనా.. ధైర్యం కోసం పోస్టు!

మాస్క్‌లు వ‌దిలేసి, చున్నీ క‌ట్టుకోండి: విజ‌య్