ఇంటర్‌నెట్‌ వినియోగంలో భారత్‌ రెండో స్థానం

13 Jun, 2019 09:17 IST|Sakshi

న్యూఢిల్లీ: ఇంటర్‌నెట్‌ వినియోగంలో భారత్‌ రెండో స్థానంలో ఉన్నట్లు  వెల్లడైంది. యూజర్‌ బేస్‌లో ప్రపంచవ్యాప్తంగా 12 శాతం వాటాతో ఇండియా ఏకంగా 2వ స్థానంలో ఉందని ‘2019 మారీ మీకర్‌’ రిపోర్ట్‌ ద్వారా వెల్లడైంది. ఇంటర్‌నెట్‌ ట్రెండ్స్‌పై ఈ నివేదిక రూపొందగా.. అమెరికా వెలుపల జరిగిన అత్యంత వినూత్నమైన ఇంటర్‌నెట్‌ కంపెనీగా ‘రిలయన్స్‌ జియో’ చరిత్ర సృష్టించింది. ఈ కంపెనీ చొరవతోనే భారత్‌లో ఇంటర్‌నెట్‌ వినియోగం గణనీయంగా పెరిగినట్లు 2019 మారీ మీకర్‌’ రిపోర్‌ పేర్కొంది. ఇక చైనా 21 శాతం వాటాతో ఉండగా.. అమెరికా యూజర్‌ బేస్‌ 8 శాతంగా ఉన్నట్లు నివేదికలో వెల్లడైంది. 

మరిన్ని వార్తలు