అమెరికానే దాటేశాం..!

26 Jan, 2020 18:28 IST|Sakshi

న్యూఢిల్లీ: భారత్‌లో స్మార్ట్‌ఫోన్‌ వినియోగం రోజురోజుకీ పెరుగుతుండడంతో ప్రపంచంలోనే రెండో అతిపెద్ద స్మార్ట్‌ ఫోన్‌ మార్కెట్‌గా అవతరించింది.  చైనా తర్వాత ప్రపంచంలోనే రెండో అతిపెద్ద స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌గా నిలిచిందని కౌంటర్‌పాయింట్‌ రీసెర్చ్‌ తెలిపింది. నివేదిక ప్రకారం.. 2019వ సంవత్సరం నాల్గవ త్రైమాసికంలోభారత స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లో 27శాతం మార్కెట్‌ షేర్‌తో షియోమీ మొదటి స్థానంలో నిలవగా, వివో 21 శాతం వాటాతో శాంసంగ్‌ను వెనక్కి నెట్టి రెండో స్థానంలో నిలిచింది. ఇక శాంసంగ్‌ 19 శాతం వాటాతో 3వ స్థానానికి పడిపోయింది.

అలాగే 12శాతం మార్కెట్‌తో ఒప్పో, 8 శాతం మార్కెట్‌ షేర్‌తో రియల్‌మీలు 4, 5వ స్థానాల్లో నిలిచాయి. కాగా కౌంటర్‌ పాయింట్‌ రీసెర్చి ప్రకారం గడిచిన నాలుగేళ్ల కాలంలో వివో బడ్జెట్‌ స్మార్ట్‌ఫోన్లను ప్రవేశపెట్టడంలో ఇతర మొబైల్‌ తయారీ కంపెనీల కన్నా ముందుందని వెల్లడైంది. అలాగే రూ.15వేల నుంచి రూ.20వేల సెజ్‌మెంట్‌లో ఫోన్‌లను తయారు చేయడంలో వివో విజయవంతమైందని, ఆయా ఫోన్ల అమ్మకాలు కూడా గణనీయంగా పెరిగాయని తేలింది. 

మరిన్ని వార్తలు