త్వరలో పెట్రో ఉత్పత్తుల దిగుమతి రహిత దేశంగా భారత్!

7 Sep, 2016 01:08 IST|Sakshi
త్వరలో పెట్రో ఉత్పత్తుల దిగుమతి రహిత దేశంగా భారత్!


న్యూఢిల్లీ: భారత్ త్వరలో పెట్రోలియం ఉత్పత్తుల దిగుమతి రహిత దేశంగా మారనుందని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ మంగళవారంనాడు పేర్కొన్నారు. ఫ్యూయెల్ ఎకానమీకి ప్రత్యామ్నాయం అభివృద్ధిపై కేంద్రం దృష్టి సారించినట్లు  తెలిపారు.  ‘మిథనాల్ ఎకానమీ’పై  నీతి ఆయోగ్ ఇక్కడ మంగళవారం నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పెట్రోలియంకు ప్రత్యామ్నాయంగా ఇథనాల్, మిథనాల్, బయో-సీఎన్‌జీల వంటి ప్రత్యామ్నాయ ఇంధనాలను అభివృద్ధి చేయడంపై కేంద్రం దృష్టి పెట్టినట్లు తెలిపారు. ఇది గ్రామీణ,  వ్యవసాయ కేంద్రాల వృద్ధికి, ఉపాధి కల్పనకు కూడా దోహదం చేసే అంశంగా వివరించారు.  అంతర్జాతీయంగా ధరలు తక్కువగా ఉన్నప్పటికీ, భారత్  ప్రస్తుత క్రూడ్ దిగుమతుల బిల్లు రూ.4.5 లక్షల కోట్లని పేర్కొన్నారు. ఇంతక్రితం ఈ బిల్లు రూ.7.5 లక్షల కోట్లుగా తెలిపారు. వ్యవసాయంలో విభిన్న ఉత్పత్తుల ద్వారా ప్రయోజనం పొందడానికి ఇది సువర్ణ అవకాశం అని ఆయన వివరించారు.

మరిన్ని వార్తలు