వారాంతాన ఇండియన్‌ ఏడీఆర్‌లు డౌన్‌

23 May, 2020 09:54 IST|Sakshi

సోమవారం యూఎస్‌ మార్కెట్లు పనిచేయవు

రంజాన్‌ సందర్భంగా దేశీ మార్కెట్లకూ సెలవు

డాక్టర్‌ రెడ్డీస్‌, ఇన్ఫోసిస్‌ ఏడీఆర్‌లు లాభాల్లో

వారాంతాన(శుక్రవారం) అమెరికా స్టాక్‌ మార్కెట్లు అటూఇటుగా ముగిశాయి. డోజోన్స్‌ నామమాత్ర నష్టంతో నిలవగా.. ఎస్‌అండ్‌పీ స్వల్పంగా లాభపడింది. ఇక నాస్‌డాక్‌ 0.4 శాతం పుంజుకుంది. అయితే అమెరికా స్టాక్‌ ఎక్స్ఛేంజీలలో లిస్టయిన దేశీ స్టాక్స్‌ (ఏడీఆర్‌)లో పలు కౌంటర్లు అమ్మకాలతో డీలాపడ్డాయి. సోమవారం(25న)  మెమోరియల్‌ డే సందర్భంగా యూఎస్‌ మార్కెట్లకు సెలవు కాగా.. రంజాన్‌ సందర్భంగా దేశీ స్టాక్‌మార్కెట్లు సైతం సోమవారం పనిచేయవు.

రెండు కౌంటర్లు మినహా..
అమెరికా స్టాక్‌ ఎక్స్ఛేంజీలలో లిస్టయిన దేశీ స్టాక్స్‌ (ఏడీఆర్‌) వారాంతాన అధిక శాతం నష్టాలతో ముగిశాయి. ఇన్ఫోసిస్‌ 1.35 శాతం పుంజుకుని 9.05 డాలర్ల వద్ద నిలవగా.. డాక్టర్‌ రెడ్డీస్‌(ఆర్‌డీవై) 1.7 శాతం బలపడి 51.41 డాలర్ల వద్ద ముగిసింది. ఇతర కౌంటర్లలో వేదాంతా(వీఈడీఎల్‌) 3 శాతం పతనమై 4.69 డాలర్లకు చేరగా.. ఐసీఐసీఐ బ్యాంక్‌(ఐబీఎన్‌) 2.8 శాతం క్షీణించి 7.76 డాలర్లను తాకింది. ఇక టాటా మోటార్స్‌(టీటీఎం) 2 శాతం వెనకడుగుతో 5.46 డాలర్ల వద్ద  వద్ద ముగిసింది. ఈ బాటలో విప్రో లిమిటెడ్‌ 1.33 శాతం బలహీనపడి 2.96 డాలర్ల వద్ద, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 1.3 శాతం నష్టంతో 36.72 డాలర్ల వద్ద స్థిరపడ్డాయి.

శుక్రవారం ఎన్‌ఎస్‌ఈలో
వారాంతాన ఎన్‌ఎస్‌ఈలో ఇన్ఫోసిస్‌ షేరు 3 శాతం ఎగసి రూ. 692 వద్ద నిలవగా.. డాక్టర్‌ రెడ్డీస్‌ 1 శాతం బలపడి రూ. 3886 వద్ద ముగిసింది. వేదాంతా 1.3 శాతం నీరసించి రూ. 89కు చేరగా.. ఐసీఐసీఐ బ్యాంక్‌ 4 శాతం పతనమై రూ. 292 స్థాయిలో నిలిచింది. ఇక టాటా మోటార్స్‌ 1.25 శాతం నష్టంతో రూ. 83 వద్ద, విప్రో 0.2 శాతం బలపడి రూ. 190 వద్ద స్థిరపడగా.. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 2 శాతం క్షీణించి రూ. 843 వద్ద ముగిసింది.

మరిన్ని వార్తలు