ఇండియన్ బ్యాంక్ లాభం 18% వృద్ధి

3 Nov, 2015 01:36 IST|Sakshi
ఇండియన్ బ్యాంక్ లాభం 18% వృద్ధి

చెన్నై: ఇండియన్ బ్యాంక్ ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో రూ.369 కోట్ల నికర లాభం ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌కు సాధించిన నికర లాభం(రూ.314 కోట్లు)తో పోల్చితే 18 శాతం వృద్ధి సాధించామని ఇండియన్ బ్యాంక్ పేర్కొంది. గత క్యూ2లో రూ.4,340 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ2లో రూ.4,579 కోట్లకు పెరిగిందని వివరించింది.

స్థూల మొండిబకాయిలు 4.21 శాతం నుంచి 4.61 శాతానికి, నికర మొండిబకాయిలు 2.55 శాతం నుంచి 2.6 శాతానికి పెరిగాయని పేర్కొంది. గత క్యూ2లో రూ.287 కోట్లుగా ఉన్న మొండిబకాయిలకు కేటాయింపులు ఈ క్యూ2లో రూ.137 కోట్లకు తగ్గాయని ఈ ఆర్థిక సంవత్సరం మొదటి ఆరునెలల కాలంలో రూ. 585 కోట్ల నికర లాభం ఆర్జించామని, గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలానికి నికర లాభం రూ.521 కోట్లని పేర్కొంది.

మొత్తం ఆదాయం రూ.8,484 కోట్ల నుంచి రూ.9,073 కోట్లకు పెరిగిందని వివరించింది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో ఇండియన్ బ్యాంక్ షేర్ బీఎస్‌ఈలో 6% లాభంతో రూ.133 వద్ద ముగిసింది.

మరిన్ని వార్తలు