ఇండియన్‌ బ్యాంక్‌ లాభాలు 11శాతం జంప్‌

6 Nov, 2017 16:29 IST|Sakshi

సాక్షి, ముంబై: ప్రభుత్వరంగ సంస్థ ఇండియన్‌ బ్యాంక్‌  రెండవ త్రైమాసికంలో  ప్రోత్సాహకర ఫలితాలను ప్రకటించింది.  ఈ ఆర్థిక  సంవత్సరం  క్యూ2 ఫలితాలను సోమవారం ప్రకటించింది.  ఎనలిస్టుల అంచనాలను అధిగమించి ఆదాయంలోనూ, నికర లాభాల్లో పురోగతిని సాధించింది.

జూలై-సెప్టెంబర్‌ 30తో ముగిసిన క్యూ 2లో నికర లాభాలు  11శాతంపైగా ఎగసి రూ. 451 కోట్లను అధిగమించాయి. నికర వడ్డీ ఆదాయం  సైతం 21 శాతం పెరిగి రూ. 1,544 కోట్లకు చేరింది. దాదాపు 14 శాతం  రుణ వృద్ధిని సాధించగా.. స్థూల మొండిబకాయిలు(ఎన్‌పీఏలు) 7.21 శాతం నుంచి 6.67 శాతానికి తగ్గాయి. నికర ఎన్‌పీఏలు సైతం 4.05 శాతం నుంచి 3.41శాతానికి  క్షీణించాయి. రూ.5,238.6 కోట్ల నుంచి రూ .4,748.2 కోట్లకు పడిపోయింది. అయితే ప్రొవిజన్లు 56 శాతం పెరిగి రూ. 744ను కోట్లుగా నమోదయ్యాయి.  ఈ ఫలితాల నేపథ్యంలో ఇండియన్‌బ్యాంక్‌  షేరు భారీ లాభాలను సాధించింది. ట్రేడర్ల కొనుగోళ్లతో  52 వారాల గరిష్టాన్ని తాకింది. 

మరిన్ని వార్తలు