తగ్గిన ఇండియన్‌ బ్యాంక్‌ వడ్డీ రేట్లు

3 Jun, 2017 01:00 IST|Sakshi
తగ్గిన ఇండియన్‌ బ్యాంక్‌ వడ్డీ రేట్లు

చెన్నై: ప్రభుత్వ రంగ ఇండియన్‌ బ్యాంక్‌ తాజాగా ఫారిన్‌ కరెన్సీ నాన్‌ రెసిడెంట్‌ (బ్యాంకింగ్‌) (ఎఫ్‌సీఎన్‌ఆర్‌–బి) టర్మ్‌ డిపాజిట్లపై వడ్డీ రేట్లు తగ్గించింది. దీంతో ఏడాది పైబడి రెండేళ్ల దాకా ఉండే కాల వ్యవధి గల ఎఫ్‌సీఎన్‌ఆర్‌ (బి) డిపాజిట్లపై వడ్డీ రేటు ప్రస్తుతమున్న 2.39% నుంచి 2.36%కి తగ్గింది. అలాగే రెండేళ్లు పైబడి..

మూడేళ్ల దాకా కాలవ్యవధి గల డిపాజిట్లపై రేటు 2.58% నుంచి 2.50%కి, మూడేళ్ల నుంచి నాలుగేళ్ల కన్నా తక్కువ వ్యవధికి 2.77% నుంచి 2.70 శాతానికి వడ్డీ రేటు తగ్గింది. నాలుగేళ్లు పైబడి, అయిదేళ్ల కన్నా తక్కువ కాలవ్యవధి ఉండే డిపాజిట్లపై 2.87 శాతం నుంచి 2.82 శాతానికి, అయిదేళ్ల వ్యవధికి 2.97 శాతం నుంచి 2.89 శాతానికి రేటు తగ్గినట్లవుతుందని ఇండియన్‌ బ్యాంక్‌ తెలిపింది. ఈ మార్పులు తక్షణమే అమల్లోకి వచ్చినట్లు వివరించింది.

మరిన్ని వార్తలు