ఓఎఫ్‌ఎస్ ద్వారా

7 Jul, 2015 00:26 IST|Sakshi
ఓఎఫ్‌ఎస్ ద్వారా

రూ.77 వేల కోట్లు
న్యూఢిల్లీ
: భారత కంపెనీలు ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్‌ఎస్) విధానంలో భారీగా నిధులు సమీకరించాయి. 2012, ఫిబ్రవరి నుంచి ఈ ఏడాది మార్చి వరకూ 129 కంపెనీలు ఓఎఫ్‌ఎస్ విధానంలో రూ.77,023 కోట్ల నిధులు సమీకరించాయని ఒక నివేదిక వెల్లడించింది.  దీంట్లో ప్రభుత్వ రంగ సంస్థల వాటా రూ.63,576 కోట్లు(82 శాతం)గా  ఉంది. కేంద్రప్రభుత్వ డిజిన్వెస్ట్‌మెంట్ ప్రక్రియకు బాగా ఉపయోగపడిన ఈ ఓఎఫ్‌ఎస్ విధానాన్ని మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ 2012, ఫిబ్రవరిలో అందుబాటులోకి తెచ్చింది.

మరిన్ని వార్తలు