ప్రభుత్వ ప్రభావం నుంచి బయటపడాలి

21 May, 2014 03:24 IST|Sakshi
ప్రభుత్వ ప్రభావం నుంచి బయటపడాలి

 పీఎస్‌బీలకు రఘురామ్ రాజన్ సూచన

 న్యూఢిల్లీ: ప్రభుత్వ ప్రభావం నుంచి బయటపడితే ప్రభుత్వ రంగ బ్యాంకుల పోటీతత్వం మరింత పెరుగుతుందని రిజర్వు బ్యాంకు గవర్నర్ రఘురామ్ రాజన్ అన్నారు. పోటీ పెరిగితే సామర్థ్యం మెరుగవుతుందని చెప్పారు. న్యూఢిల్లీలో మంగళవారం నిర్వహించిన భారతీయ కాంపిటీషన్ కమిషన్ (సీసీఐ) ఐదో వార్షిక సదస్సులో ఆయన ప్రసంగించారు.  భారత్‌లోని అనేక పీఎస్‌బీల పనితీరు మెరుగుపర్చడానికి పాలనలోనూ, కార్యకలాపాల నిర్వహణలోనూ మార్పులు తేవాల్సిన అవసరం ఉందన్నారు.
 
 రూ.8 వేల కోట్ల జరిమానాలు...
 సీసీఐ చైర్మన్ అశోక్ చావ్లా ప్రసంగిస్తూ, వ్యాపారంలో పోటీతత్వానికి వ్యతిరేకమైన పద్ధతులు పాటించిన పలు సంస్థలపై సీసీఐ ఇప్పటివరకు రూ.8 వేల కోట్ల పెనాల్టీలు విధించిందని పేర్కొన్నారు. వివిధ రంగాలకు చెందిన కేసులు వీటిలో ఉన్నాయని చెప్పారు.

>
మరిన్ని వార్తలు