కొత్త ఎఫ్‌డీఐ పాలసీ : దిగ్గజ కంపెనీలకు ఊతం

29 Aug, 2019 16:01 IST|Sakshi

మీ​కు వినియోగదారులు, మాకు ఉద్యోగాలు  - భారత్‌ బేరాలు

సాక్షి, ముంబై: భారత ఆర్థిక వ్యవస్థను మెరుగుపర్చడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం తమ విధానాలను రూపొందిస్తోంది. ప్రపంచంలోని అన్ని దేశాలతో మంచి సఖ్యతతో మెలగాలనుకుంటోంది. చిల్లర వర్తకంలో నూతన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పాలసీని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. తద్వారా మీ​కు కోట్లాది వినియోగదారులనిస్తాం, మాకు ఉద్యోగాలివ్వండి అనే  ఇచ్చిపుచ్చుకునే  ధోరణిని పాటించాలనుకుంటోందని పలువురు  ఎనలిస్టులు వ్యాఖ్యానిస్తున్నారు. ఆర్ధిక మాంద్యం వ్యాపిస్తున్న తరుణంలో ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. వీటిలో భాగంగా చిల్లర వర్తకంలో ఎఫ్‌డీఐలకు కావాల్సిన మౌలిక సదుపాయాలను ఆరు నెలల్లోనే వారికి అందించనుంది. గతంలో 30 శాతం ఇక్కడి వనరులనే ఉపయోగించాలనే నిబంధన ఉండేది, కానీ ఇప్పుడు ఆ నిబంధనను  సడిలిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

 ప్రధానంగా ఈ నిబంధన  అమెరికా స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజం ఆపిల్‌కు వరంగా మారనుంది. ఖర్చులు ఎక్కువగా ఉండడంతో గతంలో ఆపిల్‌ భారత్‌ వైపు మొగ్గుచూపలేదు.అలాగే  ప్రస్తుతం భారత్‌లో రియల్‌మీ, ఒప్పో, శాంసంగ్‌ స్మార్ట్‌ఫోన్లు మెరుగైన అమ్మకాలను సాధిస్తున్నాయి. మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ సంస్కరణలను తీసుకురావడానికి ప్రయత్నించగా సంకీర్ణ ప్రభుత్వంలో అవినీతి కుంభకోణాలు, ఆరోపణల నేపథ్యంలో యూపీఏ-2 అనుకున్న ఫలితాలను సాధించలేకపోయింది. ఐకియా సంస్థ పన్నెండేళ్ల క్రితం అనుమతులు పొందినా నిబంధనల కారణంగా 2018లో మాత్రమే తమ స్టోర్లను ప్రారంభించ గలిగింది. అమెరికా, చైనా వాణిజ్య యుద్ధంలో భాగంగా చైనా వియత్నాం వైపు మొగ్గు చూపగా, అమెరికా తమ కార్యకలాపాలను భారత్‌లో నిర్వహించే విధంగా నూతన రిటైల్‌ విధానం ఉపయోగపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. యువకులు ఎక్కువగా  ఉన్న మన దేశంలో అత్యధికంగా ఉపాధి కల్పిస్తున్న మూడు రంగాలలో వస్త్ర, ఎలక్ట్రానిక్స్‌, ఆటో పరిశ్రమలు ముందున్నాయి. ప్రధానంగా మధ్యతరగతి ప్రజల లక్ష్యంగా బహుళ జాతీయ కంపెనీలు  వ్యాపార వ్యూహాలను రచిస్తున్నాయి. 

చదవండి : ఎఫ్‌డీఐ 2.0

కేబినెట్‌ కీలక నిర్ణయాలు : ఎఫ్‌డీఐ నిబంధనల సడలింపు

మరిన్ని వార్తలు