వినోద పరిశ్రమ 12% వృద్ధి

5 Mar, 2014 01:37 IST|Sakshi
వినోద పరిశ్రమ 12% వృద్ధి

న్యూఢిల్లీ: భారత మీడియా, వినోద పరిశ్రమ గతేడాది 12 శాతం వృద్ధితో రూ.92,800 కోట్లకు చేరిందని ఫిక్కి-కేపీఎంజీ నివేదిక పేర్కొంది.

వివరాలు...,
 రకరకాల సవాళ్లు, చెప్పుకోదగ్గ మార్పులతో గత ఏడాది మీడియాకు అసాధారణ సంవత్సరంగా మిగిలింది. టీవీ, వార్తా పత్రికల ప్రకటనల ఆదాయంపై రూపాయి క్షీణత, ఆర్థిక వృద్ధి మందగమన తదితర అంశాలు తీవ్రంగానే ప్రభావం చూపాయి.  2013లో ప్రింట్ రంగం 8.5 శాతం చక్రీయ వృద్ధితో రూ. 24,300 కోట్లకు పెరిగింది. ఇక బ్రాడ్‌కాస్టింగ్, మల్టీ సిస్టమ్ ఆపరేటర్ల చందా ఆదాయం, ఒక్కో వినియోగదారుడి నుంచి లభించే సగటు ఆదాయం పెరిగి సమంజసమైన స్థాయిలకు రావడానికి 2-3 ఏళ్లు పడుతుంది. సమీప భవిష్యత్తులో మల్టీప్లెక్స్‌ల వృద్ధి మందగించవచ్చు. రిటైల్ రంగంలో మందగమనం, వాణిజ్యపరమైన రియల్ ఎస్టేట్ అభివృద్ధి కుంటుపడడం వంటి కారణాల వల్ల బాక్స్ ఆఫీస్ వృద్ధిపై ప్రభావం చూపుతాయి.

మరిన్ని వార్తలు