బలహీనంగా స్టాక్‌మార్కెట్లు : ఎస్‌బీఐ టాప్‌ విన్నర్‌

13 May, 2019 09:30 IST|Sakshi

సాక్షి, ముంబై:  దేశీయ స్టాక్‌మార్కెట్లు స్వల్ప నష్టాల్లో ప్రారంభమైనాయి.   నిఫ్టీ 11300 కుదిగువన,  సెన్సెక్స్‌ 37,500 దిగువన బలహీనంగా కొనసాగుతున్నాయి.  అయితే ప్రారంభ నష్టాలనుంచి కోలుకున్న సెన్సెక్స్‌  లాభాల్లోకి మళ్ళింది.   సెన్సెక్స్‌ 42 పాయింట్లు పుంజుకుని 37490 వద్ద, నిఫ్టీ 5 పాయింట్లు క్షీణించి 11274 వద్ద కొనసాగుతున్నాయి.  దాదాపుఅన్ని రంగాలు బలహీనంగానే ఉన్నాయి.   ఊగిసలాట ధోరణి కొనసాగే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది.  

రిలయన్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ, టాటా స్టీల్‌,  ఎల్‌ అండ్‌ టీ,  టొరంటో ఫార్మా, జెట్‌ ఎయిర్‌వేస్‌, ఐషర్‌  మోటార్స్‌ నష్టపోతున్నాయి.  ఎస్‌బీఐ లాభాలతో టాప్‌ విన్నర్‌గా ఉంది.  అటు  డాలరు మారకంలో రుపీ బలహీనంగా  70 రూపాయల స్థాయికి దిగువన కొనసాగుతోంది. 

మరిన్ని వార్తలు