వీడియో క్వాలిటీ తగ్గించిన యూట్యూబ్‌

30 Mar, 2020 15:38 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : కరోనా ఎఫెక్ట్‌ యూట్యూబ్‌ వీడియో క్వాలిటీపై పడింది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా ప్రభావంతో ప్రజలు ఇళ్లకే పరిమితమవ్వడంతో కాలక్షేపం కోసం ఇంటర్‌నెట్‌ వినియోగం పెరిగిపోయింది. దీంతో ఇంటర్‌నెట్‌ రవాణా వ్యవస్థపైన ఒక్కసారిగా భారం పడింది.

ఈ నేపథ్యంలో వీడియో స్ట్రీమింగ్‌ సర్వీస్‌ ప్రొవైడర్లు, క్వాలిటీని తగ్గించి భారాన్ని తగ్గించుకుంటున్నాయి. ఈ క్రమంలోనే భారత్‌లో వీడియోలను ఆండ్రాయిడ్‌ మొబైల్‌లలో వీక్షించే యూజర్లకు క్వాలిటీని 480 పిక్సల్‌లకు యూట్యూబ్‌ తగ్గించింది. ఏ ఇంటర్నెట్‌ కనెక్షన్‌ ఉన్నా ఆండ్రాయిడ్‌ మొబైల్‌లలో క్వాలిటీ 480 పిక్సల్‌లకు మించి ప్లే అ‍వ్వడం లేదు. అయితే డెస్క్‌టాప్‌లో యూట్యూబ్‌ వీక్షకులకు మాత్రం ఎప్పటిలానే ఆటోమేటిక్‌గా 1080 పిక్సల్‌ క్వాలిటీతో వీడియోలు ప్లే అవుతున్నాయి. ఇప్పటికే నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్‌ ప్రైమ్‌, హాట్‌స్టార్‌లు గతవారమే క్వాలిటీని తగ్గించిన విషయం తెలిసిందే. 

మరిన్ని వార్తలు