పెట్రోల్‌ పోయించుకుంటే బహుమతులు

4 Oct, 2019 10:03 IST|Sakshi

హైదరాబాద్‌: ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ తన కస్టమర్లకు దసరా, దీపావళి పండుగల సందర్భంగా మంచి ఆఫర్లను తీసుకొచ్చింది. మెగా ఫెస్టివ్‌ ధమాకా పేరుతో ఇందుకు సంబంధించిన ప్రచార కార్యక్రమాన్ని ఇండియన్‌ ఆయిల్‌ సికింద్రాబాద్‌ డివిజన్‌ ప్రారంభించింది. ద్విచక్ర వాహనదార ఏదైనా ఇండియన్‌ ఆయిల్‌ పెట్రోల్‌ స్టేషన్‌ వద్ద రూ.200 విలువైన పెట్రోల్‌ లేదా ఎక్స్‌ట్రాప్రీమియం పెట్రోల్‌ రూ.150 విలువ మేర పోయించుకున్నా మెగా లక్కీ డ్రా కింద బహుమతులు పొందడానికి అర్హులు.

నాలుగు చక్రాల వాహనాదారులు రూ.500 విలువైన సాధారణ పెట్రోల్‌ లేదా రూ.400 విలువ చేసే ఎక్స్‌ట్రాపీమియం పెట్రోల్‌ పోయించుకోవాల్సి ఉంటుంది. అలాగే, సర్వో లూబ్రికెంట్‌ ఇంజన్‌ ఆయిల్‌ను ఒక లీటర్‌ కొనుగోలు చేసిన వారూ లక్కీ డ్రాకు అర్హులు. డ్రా కింద.. ఒక నిస్సాన్‌ డాట్సన్‌ కారు, 18 హీరో మ్యాస్ట్రో బైకులు, 350 గంగా కుక్కర్లు వంటివి ఆఫర్లలో ఉన్నాయి.  పెట్రోల్‌ పోయించుకున్న కస్టమర్లు తప్పనిసరిగా బిల్లు తీసుకోవాలి. తమ మొబైల్‌ నుంచి ఇంగ్లిష్‌లో ఐవో (క్యాప్‌లెటర్‌) అని టైప్‌ చేసి, స్పేస్‌ ఇచ్చి, పెట్రోల్‌ పంప్‌ కోడ్‌ను టైప్‌ చేసి, స్పేస్‌ ఇచ్చి, బిల్లు నంబర్‌ టైప్‌ చేసి ఆ తర్వాత 8096666025 నంబర్‌కు ఎస్‌ఎంఎస్‌ చేయాలి.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

లాక్ డౌన్ : లక్షల ఉద్యోగాలు ప్రమాదంలో..

మార్కెట్లకు స్వల్ప నష్టాలు

లేబర్‌ సెస్‌ను వాడుకోండి!

‘శక్తి’మాన్‌.. బ్రహ్మాస్త్రం!

లాక్‌డౌన్‌ కష్టాలు : ఆటోమొబైల్‌ పరిశ్రమకు రిలీఫ్‌

సినిమా

విశాల్‌ స్థానంలో శింబు..!

రామాయ‌ణ్ చూస్తున్నా.. మ‌రి మీరు? 

‘విశ్వాసం’ కాంబో రిపీట్‌ 

నాకు క‌రోనా లేదు.. కానీ: కైలీ జెన్నర్

ఆ సినిమా చూడండి వైరస్‌ వ్యాప్తి అర్ధమవుతుంది

రాధిక ఆప్టేకు క‌రోనా క‌ష్టం..