రూపాయికి ఆర్‌బీఐ షాక్‌

5 Oct, 2018 15:04 IST|Sakshi
రూపాయి ఫైల్‌ ఫోటో

మొట్టమొదటిసారి 74 స్థాయికి రూపాయి పతనం

ముంబై : రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా మార్కెట్లను సర్‌ప్రైజ్‌ చేస్తూ.. రెపో రేటును యథాతథంగా ఉంచడం రూపాయిని తీవ్రంగా దెబ్బకొట్టింది. ఆర్‌బీఐ పాలసీ ప్రకటన అనంతరం వెంటనే రూపాయి అత్యంత కనిష్ట స్థాయి 74 కు పతనమైంది. డాలర్‌ మారకంలో రూపాయి మరోసారి చారిత్రాత్మక కనిష్ట స్థాయిని తాకింది. నేడు ట్రేడింగ్‌ ప్రారంభంలోనే డాలరు మారకంలో రూపాయి భారీగా నష్టపోయింది. గత కొన్ని రోజులుగా కూడా రూపాయి ఈ విధంగానే ట్రేడవుతూ వస్తోంది.

అంతర్జాతీయంగా క్రూడాయిల్‌ ధరలు పెరుగుతుండటంతో, రూపాయిపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. రూపాయిని కాపాడటానికి ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా కూడా ఫలితం లేకుండా పోతుంది. తాజాగా ఆర్‌బీఐ పాలసీ అయినా రూపాయి విలువను కాపాడుతుందని అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అమెరికా ఫెడ్‌ రేట్లు పెంచడంతో, విదేశీ నిల్వలు తరలిపోకుండా ఉండేందుకు.. రెపోను ఆర్‌బీఐ పెంచుతుందని విశ్లేషకులు భావించారు. కానీ ఆర్‌బీఐ మానిటరీ పాలసీ కమిటీ రూపాయి విలువను పెంచేందుకు ఎలాంటి ప్రకటన చేయకుండా.. రెపో రేటును యథాతథంగా ఉంచుతున్నట్టు అనూహ్య ప్రకటన చేసింది. 

మరిన్ని వార్తలు