నష్టాలతో ప్రారంభమైన రూపాయి

2 Aug, 2019 09:15 IST|Sakshi

25 పైసలు  నష్టంతో 69.25 

సాక్షి, ముంబై : డాలరు మారకంలో రూపాయి బలహీనంగా ప్రారంభమైంది. గురువారం నాటి ముగింపు 69.05 తో  పోలిస్తే 20 పైసలు నష్టంతో ట్రేడింగ్‌ను ఆరంభించింది. ప్రస్తుతం 69.25 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఆగస్టు 1 న, దేశీయ ఈక్విటీలలో భారీ అమ్మకాల మధ్య  రూపాయి 27 పైసలు  క్షీణించి ఐదు వారాల కనిష్టం వద్ద ముగిసింది.

సెప్టెంబర్‌ 1నుంచి  చైనీస్‌ దిగుమతులపై 10 శాతం  300 బిలియన్‌ డాలర్ల విలువైన అదనపు సుంకాలను విధించనున్నట్లు ప్రెసిడెంట్‌ ట్రంప్‌ పేర్కొనడంతో గురువారం అమెరికా స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజు దెబ్బతిన్నాయి. షాంఘైలో అమెరికా, చైనా ప్రతినిధుల మధ్య వాణిజ్య వివాద పరిష్కారాలు కుదరకుండానే రెండు రోజుల చర్చలు ముగిసిన నేపథ్యంలో ట్రంప్‌ తాజా చర్యలకు ఉపక్రమించడం ఆసియా మార్కెట్లను వణికిస్తోంది. దీంతో దేశీ స్టాక్‌ మార్కెట్లలో అమ్మకాలదే పైచేయిగా నిలిచే అవకాశమున్నట్లు  విశ్లేషకులు భావిస్తున్నారు. 

మరిన్ని వార్తలు