-

ఆర్‌బీఐ ప్రకటన : ఎగిసిన రూపాయి

23 Apr, 2020 16:20 IST|Sakshi

62 పైసలు ఎగిసిన రూపాయి

సాక్షి, ముబై: దేశీయ రూపాయి గురువారం భారీగా పుంజుకుంది. డాలరు మారకంలో రికార్డు కనిష్టాలకు చేరుతున్న రూపాయి గురువారం 62 పైసలు లాభపడింది. దేశీయ ఈక్విటీల్లో లాభాలతో రూపాయి ఆరంభంలో 48 పైసలు లాభంతో  76.31 వద్దకు చేరింది. అనంతరం ఇంట్రా డేలో 76 స్థాయిని టచ్ చేసింది. చివరికి 62 పైసలు పెరిగి 76.06 వద్ద ముగిసింది. బుధవారం 76.68 వద్ద స్థిరపడింది. డాలర్ ఇండెక్స్ 0.08 శాతం పెరిగి 100.46 వద్ద ట్రేడవుతోంది.  బ్రెంట్ ముడిచమురు  6.92 శాతం పెరిగి బ్యారెల్‌కు 21.78 డాలర్లకు చేరుకుంది.

ముఖ్యంగా ఆర్‌బీఐ ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ (ఓఎంఓ) ద్వారా ప్రభుత్వ సెక్యూరిటీల అదనపు కొనుగోలును చేపట్టనున్నట్లు  చెప్పడంతో పెట్టుబడిదారుల సెంటిమెంటు బలపడిందని ఫారెక్స్ వ్యాపారులు తెలిపారు. ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల నేపథ్యంలో 2020 ఏప్రిల్ 27 న ఓఎంఓ కింద ప్రభుత్వ సెక్యూరిటీలను ఒకేసారి రూ .10,000 కోట్లకు కొనుగోలు చేయనున్నామని రిజర్వ్ బ్యాంక్ తెలిపింది. మరోవైపు దేశీయ స్టాక్ మార్కెట్లు సెన్సెక్స్ 483  పాయింట్ల లాభంతో  31863 వద్ద, నిఫ్టీ 126 పాయింట్లు  ఎగిసి 9313 వద్ద  పటిష్టంగా ముగిసాయి. 
 

మరిన్ని వార్తలు