స్పెక్ట్రమ్ మెగా వేలం నేటి నుంచే

1 Oct, 2016 01:59 IST|Sakshi
స్పెక్ట్రమ్ మెగా వేలం నేటి నుంచే

రేసులో ఏడు కంపెనీలు
రిజర్వ్ ధర రూ.5.66 లక్షల కోట్లు

న్యూఢిల్లీ: దేశ చరిత్రలోనే తొలిసారిగా భారీ స్థాయిలో నిర్వహిస్తున్న స్పెక్ట్రమ్ వేలం శనివారం నుంచి ప్రారంభమవుతోంది. ఏడు బ్యాండ్లలో మొత్తం 2,354.55 మెగాహెడ్జ్ ఫ్రీక్వెన్సీ స్పెక్ట్రమ్ వేలానికి రానుంది. రూ.5.66 లక్షల కోట్లను రిజర్వ్ ధరగా కేంద్ర సర్కారు ఖరారు చేసింది.

పాల్గొనే కంపెనీలు: భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియా సెల్యులర్, రిలయన్స్ జియో ఇన్ఫోకామ్, రిలయన్స్ కమ్యూనికేషన్స్, ఎయిర్‌సెల్, టాటా టెలి

ధరావతు సొమ్ము: ఏడు టెలికం సంస్థలు రూ.14,653 కోట్లను ధరావతు సొమ్ము కింద జమ చేశాయి. ఓ ఆపరేటర్... తాను బిడ్ వేసే స్పెక్ట్రమ్ విలువలో సుమారు పది శాతాన్ని ధరావతు కింద జమ చేయాల్సి ఉంటుంది. రిలయన్స్ జియో మాతృసంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్‌ఐఎల్) రూ.6,500 కోట్లు, వొడాఫోన్ రూ.2,740 కోట్లు, ఐడియా రూ.2,000 కోట్లు, ఎయిర్‌టెల్ రూ.1,980 కోట్లు జమ చేశాయి.

వేలం అంతా ఆన్‌లైన్లోనే: వేలం ప్రక్రియ మొత్తం ఆన్‌లైన్లోనే కొనసాగుతుంది. ఈ బాధ్యతలను ఎం-జంక్షన్ సర్వీసెస్ అనే సంస్థకు సర్కారు అప్పగించింది. ఈ వారం ప్రారంభంలో డమ్మీ వేలం నిర్వహించి అంతా సాఫీగానే ఉన్నట్టు ప్రభుత్వం నిర్ధారించుకుంది. వేలం సోమవారం నుంచి శనివారం వరకు ప్రతి రోజూ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 7.30 గంటల వరుకు కొనసాగుతుంది.

మరిన్ని వార్తలు