బ్రిజ్‌మోహన్‌లాల్ ముంజాల్ మృతి తీరని లోటు

3 Nov, 2015 00:44 IST|Sakshi
బ్రిజ్‌మోహన్‌లాల్ ముంజాల్ మృతి తీరని లోటు

వ్యాపార వర్గాల నివాళి
న్యూఢిల్లీ: హీరో మోటొకార్ప్ వ్యవస్థాపకులు బ్రిజ్‌మోహన్ లాల్ ముంజాల్ మృతి పరిశ్రమకు తీరని లోటని భారత వ్యాపార, వాణిథ జ్య వర్గాలు సంతాపం వ్యక్తం చేశాయి. 92 ఏళ్ల ముంజాల్ ఆదివారం సాయంత్రం మరణించారు. హీరో మోటో వ్యవస్థాపకులు బ్రిజ్‌మోహన్ లాల్ ముంజాల్ గొప్ప గొప్ప సంస్థలను నిర్మించిన గొప్పవ్యక్తని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నివాళులర్పించారు.  ముంజాల్ నాణ్యతకు, ప్రమాణాలకు కట్టుబడి ఉన్నారని వాణిజ్యం, పరిశ్ర మల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తన సంతాప సందేశంలో పేర్కొన్నారు.

భారత పారిశ్రామిక రంగానికి సంబంధించిన అత్యంత ప్రముఖులైన వ్యక్తుల్లో ఆయన ఒకరని సీఐఐ ప్రెసిడెంట్ సుమీత్ మజుందార్ చెప్పారు. అంతర్జాతీయంగా భారత వాహన రంగానికి ఎనలేని ఖ్యాతిని ముంజాల్ ఆర్జించిపెట్టారని సియామ్ ప్రెసిడెంట్ వినోద్ దాసరి చెప్పారు. ప్రస్తుత పాకిస్తాన్‌లోని కమాలియాలో 1923లో ముంజాల్ జన్మిం చారు. ముంజాల్ సోదరులు లూధియానాలో సైకిల్ విడిభాగాలు తయారు చేసే చిన్న వ్యాపారాన్ని ప్రారంభించారు. భారత్‌లో అతిపెద్ద వ్యాపార గ్రూప్‌గా హీరో మోటోకార్ప్ అవతరించడంలో ముంజాల్ ఇతోధికంగా కృషి చేశారు. 2005లో ఆయనకు పద్మ భూషణ్ అవార్డు లభించింది.

మరిన్ని వార్తలు