వచ్చే ఏడాది వృద్ధి 7.1 శాతం: హెచ్‌ఎస్‌బీసీ

3 Feb, 2017 00:29 IST|Sakshi
వచ్చే ఏడాది వృద్ధి 7.1 శాతం: హెచ్‌ఎస్‌బీసీ

న్యూఢిల్లీ: భారత్‌ వచ్చే ఆర్థిక సంవత్సరం (2017–18) 7.1 శాతం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)వృద్ధి రేటును నమోదు చేసుకుంటుందని అంతర్జాతీయ ఆర్థిక సేవల దిగ్గజం– హెచ్‌ఎస్‌బీసీ నివేదిక ఒకటి పేర్కొంది. బడ్జెట్‌లో పలు ప్రోత్సాహక ఫలితాలు వచ్చే ఆర్థిక సంవత్సరం వృద్ధి తీరుకు దోహదపడతాయని భావిస్తున్నట్లు నివేదిక విడుదల సందర్భంగా హెచ్‌ఎస్‌బీసీ ఇండియా చీఫ్‌ ఎకనమిస్ట్‌ ప్రంజుల్‌ భండారీ తెలిపారు.

ఆయన తెలిపిన నివేదిక అంశాలను పరిశీలిస్తే– దేశంలో రానున్న నెలలో వినియోగం గణనీయంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇది పెట్టుబడులకు కొంత రికవరీ అంశం.  ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటును 6.3 శాతంగా అంచనా వేసినా.. వచ్చే ఆర్థిక సంవత్సరం ఇది గణనీయంగా మెరుగుపడే వీలుంది.

మరిన్ని వార్తలు