రికవరీ బాటలో టూవీలర్‌ పరిశ్రమ

6 Jun, 2017 05:47 IST|Sakshi
రికవరీ బాటలో టూవీలర్‌ పరిశ్రమ

2018లో 8–10 శాతం వృద్ధి అంచనా
రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా నివేదిక


న్యూఢిల్లీ: డీమోనిటైజేషన్, బీఎస్‌–3 వాహనాల నిషేధం వంటి వాటితో గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్న టూవీలర్‌ పరిశ్రమ రికవరీ బాటలో పయనిస్తోంది. ఇందులో 2018 ఆర్థిక సంవత్సరంలో 8–10 శాతం వృద్ధి నమోదుకావొచ్చని ప్రముఖ రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా తన నివేదికలో అంచనా వేసింది. వార్షిక ప్రాతిపదికన చూస్తే 2016, నవంబర్‌– 2017, మార్చి మధ్యకాలంలో టూవీలర్‌ పరిశ్రమలో 6.5 శాతం క్షీణత నమోదయ్యిందని పేర్కొంది. డీమోనిటైజేషన్‌ కారణంగా టూవీలర్‌ పరిశ్రమలోని మోటార్‌సైకిల్స్, స్కూటర్ల విభాగాలపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడిందని ఇక్రా సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ సుబ్రతా రాయ్‌ తెలిపారు.

‘డిమోనిటైజేషన్‌ ప్రభావం తగ్గింది. డిమాండ్‌ పుంజుకుంటోంది. 2018 ఆర్థిక సంవత్సరంలో దేశీ టూవీలర్‌ విక్రయాల్లో 8–10 శాతం వృద్ధి నమోదుకావొచ్చు’ అని వివరించారు. ఇక ఈ ఏడాది ఏప్రిల్‌లో టూవీలర్‌ విభాగంలో 7.3 శాతం వృద్ధి నమోదయ్యిందని పేర్కొన్నారు. సాధారణ రుతుపవన అంచనాలు, రూరల్‌ ఎంప్లాయిమెంట్‌ గ్యారంటీ స్కీమ్, మంచి పంట దిగుబడి వంటి అంశాలు గ్రామీణ ప్రాంత డిమాండ్‌కు దోహదపడనున్నాయని తెలిపారు.

>
మరిన్ని వార్తలు