స్టాక్‌ మార్కెట్లలో కొనుగోళ్ల పండగ..

13 Jan, 2020 16:32 IST|Sakshi

ముంబై : అమెరికా-చైనా వాణిజ్య ఒప్పందంపై సానుకూల సంకేతాలతో పాటు పారిశ్రామిక ఉత్పత్తి గణాంకాల తోడ్పాటుతో స్టాక్‌ మార్కెట్లు సోమవారం భారీ లాభాలతో ముగిశాయి. ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ డిసెంబర్‌ త్రైమాసికానికి మెరుగైన ఆర్థిక ఫలితాలు వెల్లడించడం మార్కెట్‌ సెంటిమెంట్‌ను ప్రభావితం చేసింది.

ఇన్ఫోసిస్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, భారతి ఎయిర్‌టెల్‌, హెచ్‌యూఎల్‌ షేర్లలో కొనుగోళ్లు వెల్లువెత్తాయి. ఇక టీసీఎస్‌, ఎస్‌బీఐ, యాక్సిస్‌ బ్యాంక్‌ షేర్లు నష‍్టపోయాయి. మొత్తంమీద బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 259 పాయింట్ల లాభంతో 41,859 పాయింట్ల వద్ద ముగియగా, 72 పాయింట్లు కోల్పోయిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 12,329 పాయింట్ల వద్ద క్లోజయింది.

మరిన్ని వార్తలు