స్వల్పలాభంతో మొదలైన మార్కెట్‌

1 Jul, 2020 09:31 IST|Sakshi

దేశీయ ఈక్విటీ మార్కెట్‌ బుధవారం స్వల్ప లాభంతో మొదలై, పరిమితి శ్రేణిలో కదలాడుతుంది. సెన్సెక్స్‌ 50 పాయింట్ల లాభంతో  34966 వద్ద, నిఫ్టీ 15 పాయింట్లు పెరిగి 10316 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. అటో, ఆర్థిక, ఎఫ్‌ఎంసీజీ, ఐటీ ప్రభుత్వరంగ షేర్ల బ్యాంకు షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభిస్తోంది. మీడియా, మెటల్‌, ఫార్మా, రియల్టీ, ప్రభుత్వరంగ బ్యాంక్‌ షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోంటున్నాయి. 

ఇక అంతర్జాతీయ మార్కెట్లను పరిశీలిస్తే..., లాక్‌డౌన్‌ తర్వాత ఆర్థిక వ్యవస్థ నెమ్మదిగా రికవరీ బాటలో సాగనున్న అంచనాలతో మంగళవారం అమెరికా మార్కెట్‌ 2రోజు లాభాలతో ముగిసింది. అంతకుముందు యూరోపియన్‌ మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి. మన మార్కెట​ ప్రారంభ సమయానికి ఆసియాలో మార్కెట్లన్నీ సానుకూలంగా కదులుతున్నాయి.  

బజాజ్‌ అటో, భారతీ ఎయిర్‌టెల్‌, హెచ్‌డీఎఫ్‌సీ, బీపీసీఎల్‌, యూపీఎల్‌ షేర్లు 1శాతం నుంచి 2శాతం లాభపడ్డాయి. ఎల్‌అండ్‌టీ, జీ లిమిటెడ్‌, ఎన్‌టీపీసీ, ఓఎన్‌జీసీ, కోటక్‌ బ్యాంక్‌ షేర్లు 1.50శాతం నుంచి 2.50శాతం నష్టపోయాయి. 

మరిన్ని వార్తలు