లాభాల్లోకి మళ్లిన సూచీలు

31 Aug, 2018 09:44 IST|Sakshi

సాక్షి, ముంబై: దేశీ స్టాక్‌మార్కెట్లు ఫ్లాట్‌గా ప్రారంభమైనాయి.రికార్డు లాభాల తరువాత గత రెండురోజులుగా మార్కెట్లు కన్సాలిడేషన్‌ బాటలో ఉన్నాయి.  అయితే ఆరంభ నష్టాలనుంచి కొద్దిసేపటికే పుంజుకున్న కీలక సూచీలు లాభాల వైపు మళ్లాయి. దీంతోసెప్టెంబర్‌ డెరివేటివ్‌ కౌంటర్‌ సానుకూలంగా మారింది. ప్రస్తుతం సెన్సెక్స్‌ 134 పాయింట్లు పుంజుకుని 38,824వద్ద, నిఫ్టీ 48 పాయింట్లు ఎగిసి 11725 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. తద్వార కీలక సూచీలురెండూ  ప్రధానమద్దతు స్థాయిలకుపైన స్థిరంగా ఉన్నాయి. ఫార్మ, ఐటీ, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ సెక్టార్‌ లాభాల్లో ఉంది.  బ్యాంకింగ్‌ సెక్టార్‌ బలహీనంగా ఉంది. ఓఎన్‌జీసీ, గెయిల్‌, సన్‌ఫార్మా, డా.రెడ్డీస్‌, విప్రో , ఇన్ఫోసిస్‌ టాప్‌ గెయినర్స్‌గా ఉన్నాయి. యస్‌బ్యాంక్‌ 4 శాతం పతనంకాగా, ఆర్ఐఎల్‌, ఎయిర్‌టెల్‌, వేదాంత తదితర షేర్లు కూడా నష్టపోతున్నాయి.

చైనా దిగుమతులపై సెప్టెంబర్‌ 5నుంచీ అమలు చేయనున్న టారిఫ్‌లపై వెనక్కి తగ్గేదిలేదంటూ  అమెరికా  అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ తాజాగా స్పష్టం చేయడంతో  ఆసియా, అమెరికా మార్కెట్లు ప్రతికూలంగా  మారాయి.  దీంతో ఆరంభంలో దేశీయస్టాక్‌మార్కెట్లు కూడా ఆరంభంలో బలహీనపడినా వెంటనే పుంజుకోవడం విశేషం. మరోవైపు డాలరు మారకంలో రూపాయి మరింత బలహీనపడింది.   తొలసారి 71  రూపాయలను స్తాయికి పతనమైంది,.
 

మరిన్ని వార్తలు