ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు ఐఏటీఏలో సభ్యత్వం

31 Oct, 2019 04:52 IST|Sakshi

న్యూఢిల్లీ: చౌక చార్జీల విమానయాన సంస్థ ఇండిగో.. అంతర్జాతీయ విమానయాన సంఘం (ఐఏటీఏ)లో సభ్యత్వం పొందినట్లు బుధవారం ప్రకటించింది. ఇటీవలి కాలంలోనే సంస్థ సేవలు టర్కీ, వియత్నాం, మయన్మార్, చైనా వంటి దేశాలకు విస్తరించిన విషయం తెలిసిందే కాగా, సరిగ్గా ఇటువంటి సమయంలో సభ్యత్వం పొందడం వల్ల ప్రపంచంలో అత్యుత్తమ వాయు రవాణా వ్యవస్థగా ఇండిగోను తీర్చిదిద్దాలనే లక్ష్యానికి సహకారం లభించిందని సంస్థ సీఈఓ రోనోజోయ్‌ దత్తా అన్నారు. ఇండిగో ప్రస్తుతం రోజుకు 1,500 విమాన సర్వీసులను నిర్వహిస్తుండగా.. వీటిలో 60 దేశీయ, 23 అంతర్జాతీయ గమ్యస్థానాలు ఉన్నాయి. మొత్తం 247 ఎయిర్‌క్రాఫ్ట్‌లను సంస్థ కలిగిఉంది. ఇక ఐఏటీఏ 290 ఎయిర్‌లైన్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తోంది. మరోవైపు ఈ ఏడాది మార్చిలోనే స్పైస్‌జెట్‌ ఈ సంఘంలో సభ్యత్వం పొందిన తొలి భారత చౌక చార్జీల విమానయాన సంస్థగా నమోదైంది.

వ్యక్తిగత ఆదాయపు పన్ను భారం తగ్గకపోవచ్చు!
న్యూఢిల్లీ: వ్యక్తిగత ఆదాయపు పన్ను(ఐటీ) తగ్గింపు నిర్ణయం కేంద్రం తీసుకునే అవకాశం లేదని ఉన్నత స్థాయి వర్గాల నుంచి సమాచారం అందుతోంది. కార్పొరేట్‌ రంగానికి ఊతం ఇవ్వడానికి ఆర్థికశాఖ ఇటీవలే కార్పొరేట్‌ పన్నును ఏకంగా 10 శాతం తగ్గించింది. పెట్టుబడుల పెరుగుదల, ఉపాధి కల్పన, ఉత్పత్తి ధర తగ్గడం తద్వారా వ్యవస్థలో డిమాండ్, వినియోగం పెరగడం దీని లక్ష్యం. వినియోగదారు కొనుగోలు సామర్థ్యం, డిమాండ్‌ పెరగడానికి వ్యక్తిగత ఆదాయపు పన్ను కూడా తగ్గించాలని ఇటీవల కొన్ని వర్గాల నుంచి డిమాండ్‌ వస్తోంది.

మరిన్ని వార్తలు