ఇండిగో విమానంలో సమస్య

12 Apr, 2019 21:06 IST|Sakshi

సాంకేతిక సమస్య, ఊగిపోయిన ఇంజీన్‌

సురక్షితంగా వెనక్కి మళ్లింపు

ఊపిరి పీల్చుకున్న ప్రయాణీకులు

సాక్షి, న్యూఢిల్లీ: ఇండిగో విమానంలో మరోసారి ఇంజీన్‌ సమస్య తలెత్తడం కలకలం సృష్టించింది. ఢిల్లీ -ముంబై విమానంలో ప్రయాణం మధ్యలో అకస్మాత్తుగా సాంకేతిక సమస్య వచ్చింది. గాల్లో ఉండగానే  ఇంజీన్‌ ఒక్కసారిగా వైబ్రేట్‌ అవ్వడం మొదలుపెట్టింది. దీంతో  ప్రయాణికులు తీవ్రం ఆందోళనకు లోనయ్యారు. అయితే వెంటనే అప్రమత్తమైన సిబ్బంది విమానాన్ని వెనక్కి మళ్లించారు.  దీంతో ప్రయాణీకులు ఊపిరి పీల్చుకున్నారు. 

అయితే ఈ ఘటనపై స్పందించిన ఇండిగో వివరణ ఇచ్చింది. పక్షి ఢీకొనడం వల్ల మెయిన్‌ ఇంజీనల్‌లో ఇబ్బంది ఏర్పడిందని వెల్లడించింది. మరోవైపు ఇండిగో విమానాల్లో ఇలాటి సమస్యలు రావడం, ఊగిపోవడం లాంటివి జరిగిన సందర్భాలు కనీసం 15 ఉన్నాయని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి.  ఇండిగోలోని నియో ఇంజీన్‌లో సమస్యలు రావడం, మార్గం మధ్యలోనే వెనక్కి మళ్లించడం చాలా సాధారణంగా మారిపోయిందని, భద్రతా రీత్యా చాలా సీరియస్‌గా పరిగణించాల్సిన అంశమని పేర్కొన్నారు.  

మరిన్ని వార్తలు