ఇండిగో చార్జీలు ప్రియం..

30 May, 2018 01:40 IST|Sakshi

రూ.400 దాకా ఇంధన సర్‌చార్జీ వడ్డన

న్యూఢిల్లీ: విమాన ఇంధన ధరలు పెరుగుదలతో టికెట్ల రేట్లకూ రెక్కలొస్తున్నాయి. అన్నింటికన్నా ముం దుగా.. ఇండిగో ఎయిర్‌లైన్స్‌ ఇందుకు తెరతీసింది. దేశీ రూట్లలో టికెట్లపై రూ.400 దాకా ఇంధన సర్‌చార్జీ విధించాలని నిర్ణయించింది.

1,000 కిలోమీటర్ల లోపు ప్రయాణాలకు సంబంధించిన టికెట్లపై రూ.200, అంతకు మించిన దూరాలపై రూ.400 సర్‌చార్జీ ఉంటుందని ఇండిగో తెలిపింది. మే 30 నుంచి ఇది అమల్లోకి వస్తుందని వివరించింది.  అటు ఇంధన (ఏటీఎఫ్‌) రేటు పెరగడానికి ఇటు రూపాయి విలువ క్షీణించడం కూడా తోడవడంతో ఎయిర్‌లైన్స్‌పై అదనపు భారం పడుతోందని ఇండిగో చీఫ్‌ కమర్షియల్‌ ఆఫీసర్‌ సంజయ్‌ కుమార్‌ తెలిపారు.
 

మరిన్ని వార్తలు