అయ్యయ్యో...ఇండిగో

30 Jul, 2018 18:44 IST|Sakshi

సాక్షి,ముంబై: అతిపెద్ద దేశీయ వాహకాన్ని ఇండిగో ఆపరేటర్‌ ఇంటర్‌ గ్లోబెల్ ఏవియేషన్‌  క్యూ1 ఫలితాల్లో  చతికిల పడింది.  విదేశీ మారకం, అధిక ఇంధన ధరలు సంస్థ తొలి త్రైమాసిక ఫలితాలను బాగా దెబ్బ తీసాయి. గత ఏడాది ఇదే క్వార్టర్‌లో  8.11 బిలియన్‌ డాలర్ల లాభాలను నమోదు చేసిన బడ్జెట్ క్యారియర్  ఇండిగో వివిధ ప్రతికూల అంశాలకారణంగా తాజా త్రైమాసికంలో భారీగా నష్టపోయింది.  క్యూ1లో నికర లాభం ఏకంగా 96.6 శాతం క్షీణించి రూ.278 మిలియన్లకు చేరింది. అయితే ఈ త్రైమాసికంలో అమ్మకాలు పుంజుకున్నాయి.  13.2 శాతం వృద్ధితో రూ .6.51 బిలియన్లకు చేరుకున్నాయి. అంతకు ముందు ఏడాది ఇదే కాలంలో 5.75 బిలియన్ డాలర్ల అమ్మకాలు జరిగాయి.

విదేశీ మారకం, అధిక ఇంధన ధరలతోపాటు, మార్కెట్‌లో నెలకొన్న పోటీ కారణంగా లాభాలు క్షీణించినట్టు సంస్థ వెల్లడించింది. అయితే ఈ త్రైమాసికానికి  ప్రతికూల పరిస్తితులను ఎదుర్కొంటున్నప్పటికీ,  సుదీర్ఘ ప్రణాళికతో ముందుకు వెళుతున్నట్టు  ఇండిగో సహ వ్యవస్థాపకుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్  రాహుల్ భాటియా  ప్రకటించారు.  దేశీయంగా కొత్త మార్గాలతోపాటు భారతదేశంలోని వివిధ నగరాలను, అంతర్జాతీయ గమ్యస్థానాలతో అనుసంధానిస్తున్నట్టు తెలిపారు.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు