ఇండిగో ఫలితాలు భేష్‌  

27 May, 2019 20:47 IST|Sakshi

సాక్షి, ముంబై  :   బడ్జెట్‌ క్యారియర్ ఇండిగో సంస్థ  క్యూ4 ఫలితాల్లో అదరగొట్టింది. మార్చితో ముగిసిన నాలుగవ త్రైమాసికంలో ఇంటర్‌ గ్లోబ్ ఏవియేషన్,రూ. 589.6 కోట్ల లాభాలు ఆర్జించింది.  గత ఏడాది ఇదే క్వార్టర్‌తో  పోలిస్తే అయిదు రెట్ల లాభాలను ఆర్ఝించింది.  ఈ క్వార్టర్‌లో 12 శాతం పెరిగాయి. జనవరి - మార్చి మధ్య సీటుకు కిలోమీటర్‌కు ఆదాయం 5.9 శాతం పెరిగి రూ.3.63గా ఉంది. ఈ త్రైమాసికంలో ఆదాయం 35.9 శాతం పెరిగి రూ .7,883.3 కోట్లకు చేరింది. ఎబిటా మార్జిన్లు  93.7 శాతం పెరిగి 2,192.6 కోట్లకు పెరిగాయి, మార్జిన్ గత ఏడాది ఇదే కాలానికి పోలిస్తే 830 బేసిస్ 27.8 శాతానికి పెరిగింది. చమురు ధరలు  బారీగా పెరగడంతో   వార్షిక ప్రాతిపదికన  లాభాలు గణనీయంగా పడిపోయాయి. 

అధిక ద్రవ్యోల్బణం, బలహీనమైన రూపాయి, తీవ్రమైన పోటీతత్వ వాతావరణం కారణాల రీత్యా దేశీయంగా  విమానయాన పరిశ్రమ 2019 ఆర్థిక సంవత్సరం చాలా కఠినమైన సంవత్సరమని ఇండిగో సీఈవో రనున్‌జోయ్‌ దత్తా తెలిపారు.  అయితే ఇండిగో సంస్థ పుంజుకుంటోందని, భవిష్యత్‌ బుల్లిష్‌గా ఉంటుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. 2020 సంవత్సరానికి గాను సీటుకు కిలోమీటర్‌కు 30 శాతం పెరుగదల ఉంటుందని ఇండిగో అంచనా వేస్తోంది.

డివిడెండ్‌ : ఈక్విటీ షేరుకు  రూ. 5చొప్పున డివిడెండ్‌ చెల్లించనుంది.

కాగా  ఆర్థిక సంక్షోభం కారణంగా జెట్ ఎయిర్‌వేస్‌ కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేసింది.  జెట్‌ వాటాల కొనుగోలు విషయం ఇంకా కొలిక్కి రాని సంగతి  తెలిసిందే. ఈ పరిణామాలు ఇండిగోతోపాటు,  స్పైస్ జెట్ లాంటి సంస్థలకు  లాభించింది. 
 

మరిన్ని వార్తలు