వర్జిన్‌ ఆస్ట్రేలియాను కొంటాం..

16 May, 2020 03:55 IST|Sakshi

బిడ్డింగ్‌లో పాల్గొనేందుకు ఒప్పందం

ఇంటర్‌గ్లోబ్‌ ఎంటర్‌ప్రైజెస్‌ వెల్లడి  

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ కట్టడిపరమైన ఆంక్షలతో కుదేలైన వర్జిన్‌ ఆస్ట్రేలియా (వీఏ) కొనుగోలుపై దేశీ విమానయాన సంస్థ ఇండిగోలో అతి పెద్ద వాటాదారు అయిన ఇంటర్‌గ్లోబ్‌ ఎంటర్‌ప్రైజెస్‌ కసరత్తు చేస్తోంది. వీఏ విక్రయ ప్రక్రియలో పాల్గొనేందుకు సంబంధించి ఒప్పందం కుదుర్చుకున్నట్లు వెల్లడించింది. ఇండిగో ఇద్దరు ప్రమోటర్లలో ఒకరైన రాహుల్‌ భాటియాకు చెందిన ఇంటర్‌గ్లోబ్‌ ఎంటర్‌ప్రైజెస్‌కు కంపెనీలో అత్యధికంగా 37.8% వాటా ఉంది. మరో ప్రమోటరు రాకేశ్‌ గంగ్వాల్, ఆయన కుటుంబానికి 36.64% వాటాలు ఉన్నాయి.

బ్రిటన్‌ వ్యాపారవేత్త రిచర్డ్‌ బ్రాన్సన్‌ సహ వ్యవస్థాపకుడిగా 2000లో వర్జిన్‌ ఆస్ట్రేలియా ఫుల్‌ సర్వీస్‌ ఎయిర్‌లైన్స్‌గా కార్యకలాపాలు ప్రారంభించింది. కొన్నాళ్లుగా ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ఈ సంస్థ.. ఇటీవల కరోనా వైరస్‌పరమైన ఆంక్షల కారణంగా మార్చిలో అన్ని సర్వీసులు రద్దు చేయడంతో మరింత కుదేలైంది. ఆస్ట్రేలియా ప్రభుత్వం నుంచి సుమారు 887.60 మిలియన్‌ డాలర్ల రుణం వస్తుందని ఆశించినప్పటికీ.. అది సాధ్యపడలేదు. దీంతో ఏప్రిల్‌ 21న దివాలా చట్టాల కింద రక్షణ కోరుతూ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంది. సంస్థలో సుమారు 16,000 మంది ఉద్యోగులు ఉన్నారు.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు