దెబ్బ మీద దెబ్బ: ఇండిగో భారీ పతనం

3 May, 2018 11:35 IST|Sakshi

సాక్షి, ముంబై:  దేశీయ విమానయాన సేవల సంస్థ ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్‌కు అటు అధ్యక్షుడు రాజీనామా, ఇటు ఫలితాల షాక్‌ భారీగా తగిలిం​ది. గత ఆర్థిక సంవత్సరం(2017-18) చివరి త్రైమాసికంలో సాధించిన ఫలితాలు ఇన్వెస్టర్లను నిరాశపరచడంతో ఈ కౌంటర్లో అమ్మకాలకు తెరలేచింది.  దీంతో  ఇండిగో షేరు 18  శాతానికి పైగా కుప్పకూలింది.  2016 జనవరి తరువాత ఇదే అదపెద్ద పతనమని మార్కెట్‌ వర్గాలు  విశ్లేషించాయి.  ముఖ‍్యంగా ఇండిగో అధ్యక్షుడు ఆదిత్య ఘోష్ రాజీనామా తర్వాత  షేర్లు 26 ఏప్రిల్ నుంచి తగ్గుముఖం పట్టాయి.  26శాతం క్షీణించి దాదాపు రూ. 13650 కోట్ల విలువైన మార్కెట్ విలువ కోల్పోయింది.

క్యూ4 ఫలితాల దెబ్బ
క్యూ4(జనవరి-మార్చి)లో ఇండిగో నికర లాభం 75 శాతం పతనమై 118  కోట్ల రూపాయలను నమోదు చేసింది. నిర్వహణ, ఇంధన వ్యయాలు పెరగడం దీనికి కారణంమని ఇండిగో  మార్కెట్‌ ఫైలింగ్‌లో పేర్కొంది. మొత్తం ఆదాయం మాత్రం 18 శాతం ఎగసి రూ. 6057 కోట్లకు చేరింది. ఇంధన వ్యయాలు రూ. 1751 కోట్ల నుంచి 2338 కోట్లకు పెరిగినట్లు కంపెనీ  వెల్లడించింది. అయితే గత ఏడాది ఇదే త్రైమాసికంలో రెవెన్యూ 17.8 శాతం పెరిగి రూ .5,141.99 కోట్లనుంచి  రూ .656.84 కోట్లను ఆర్జించింది.  ఈ త్రైమాసికంలో ఇంధన వ్యయం రూ .2,338 కోట్లు పెరిగి రూ .1,751 కోట్లకు చేరుకుంది.

>
మరిన్ని వార్తలు