ఎయిర్‌ ఇండియా రేసులో ఇండిగో

29 Jun, 2017 15:21 IST|Sakshi
ఎయిర్‌ ఇండియా రేసులో ఇండిగో

న్యూఢిల్లీ:  ప్రభుత్వ రంగ  విమానయాన సంస్థను ఎయిర్‌ ఇండియాను కొనుగోలు చేసేందుకు  ప్రయివేటు ఎయిర్‌లైన్స్‌  సంస్థ ఆసక్తి కనబరుస్తోంది. అప్పుల సంక్షోభంలో ఇరుక్కున్న ఎయిర్‌ ఇండియాపై   దేశీయ  ఎయిర్లైన్స్ , బడ్జెట్‌ క్యారియర్‌ ఇండిగో  ముందుకు వచ్చింది.  ఈ మేరకు ప్రభుత్వానికి  ఇండిగో లేఖ రాసినట్టు సమాచారం.

ఎయిర్‌ ఇండియా ప్రయివేటీకరణకు  కేంద్ర  క్యాబినెట్‌ ఇలా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిందో లేదో (24గం.ల్లోపే) అలా సంస్థలు క్యూ కడుతున్నాయి.  ముఖ్యంగా  మార్కెట్ వాటా పరంగా  అతిపెద్ద ఎయిర్‌లైన్స్‌  ఇండిగో  ఈ  రేసులో  ముందు వరసలో ఉండటం విశేషం.
 
ఎయిర్‌ ఇండియా కొనుగోలుకు ఇండిగో ఆసక్తిగా  ఉందని  సెంట్రల్ ఏవియేషన్  సెక్రటరీ ఆర్ఎన్ చౌబే  గురువారం ప్రకటించారు. వీటితోపాటు ఇతర  దేశీయ, అంతర్జాతీయ విమాన సంస్థల ద్వారా  అనధికారికంగా ప్రకటించాయని  చెప్పారు. దీనిపై క్యాబినెట్‌ శుక్రవారం నిర్ణయం తీసుకోనుందని తెలిపారు. అలాగే టాటా గ్రూపు నుంచి తమకు ఎలాంటి  ప్రతిపాదనలు అందలేదన్నారు.
 
మరోవైపు ఎయిర్ ఇండియాను టాటా గ్రూప్ కొనుగోలు చేయవచ్చని మీడియా నివేదికలు గుప్పుమన్నాయి. అయితే ఈ వార్తలపై టాటా ఇంకా స్పందించలేదు.కాగా ఎయిర్‌ ఇండియా పెట్టుబడుల ఉపసంహరణకు  కేంద్ర క్యాబినెట్ ఆమోదం గత రాత్రి (బుధవారం) ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే.  


 

మరిన్ని వార్తలు