5శాతం ప్రీమియం : ఇండోస్టార్‌ డెబ్యూ లిస్టింగ్‌

21 May, 2018 10:28 IST|Sakshi

సాక్షి,ముంబై: ఐపీవోలో అదరగొట్టిన  ఎన్‌బీఎఫ్‌సీ సంస్థ  ఇండోస్టార్‌ కేపిటల్‌ ఫైనాన్స్‌ లిస్టింగ్‌లో ప్రీమియంతో డెబ్యూలో  శుభారంభాన్నిచ్చింది. సోమవారం   స్టాక్‌ ఎక్స్ఛేంజీలలో దాదాపు 5 శాతం ప్రీమియంతో లిస్టయ్యింది. ఇష్యూ ధర రూ. 572 కాగా.. బీఎస్‌ఈలో రూ. 28 లాభంతో రూ. 600 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. . ప్రస్తుతం 3.7 శాతం బలపడి రూ. 593 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 606 వద్ద గరిష్టాని నమోదు చేసింది.  ఇటీవల  ఐపీవోకు దాదాపు 7 రెట్లు ఆదరణతో రూ. 1844 కోట్లను సమీకరించింది.

ఇండోస్టార్‌ క్యాపిటల్‌ ఫైనాన్స్‌ ఐపీవోకు భారీ స్పందన లభించింది. మొత్తం రూ.1844 కోట్లు విలువ చేసే ఐపీవో ఏడురెట్లు సబ్‌స్క్రైబ్‌ అయింది. ఇష్యూకి ముందురోజు యాంకర్‌ ఇన్వెస్టర్ల నుంచి నిధులను సమీకరించింది. 24 యాంకర్‌ సంస్థలకు 96.7 లక్షల షేర్లను కేటాయించింది. షేరుకి రూ. 572 ధరలో వాటాను కేటాయించడం ద్వారా రూ. 553 కోట్లను సమకూర్చుకుంది. ఆఫర్‌లో భాగంగా రూ.700 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయడంతో పాటు, ప్రస్తుత వాటాదారులకు చెందిన 30 శాతం వాటాకు సమానమైన 2 కోట్ల షేర్లను సైతం విక్రయానికి  ఉంచింది. కాగా.. ఇన్వెస్ట్‌ చేసిన యాంకర్‌ సంస్థలలో ఎస్‌బీఐ ఎంఎఫ్‌, హెచ్‌డీఎఫ్‌సీ ఎంఎఫ్‌, ఆదిత్య బిర్లా సన్‌లైఫ్‌ ఎంఎఫ్‌, ఐసీఐసీఐ లంబార్డ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ తదితరాలున్నాయి. ప్రధానంగా కార్పొరేట్‌ రుణాలు, వాహన రుణాల వ్యాపారంలో ఉన్నఇండోస్టార్‌ క్యాపిటల్‌ మొత్తం విలువ రూ.5,200 కోట్లుగా అంచనా. ఈ ఐపీవోకు మోతీలాల్ ఓస్వాల్‌, మోర్గాన్‌ స్టాన్లీ, నొమోరాలు ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకర్లుగా వ్యవహరిస్తున్నాయి.  

మరిన్ని వార్తలు